Tuesday, May 7, 2024
- Advertisement -

మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాలో ఇద్ద‌రు కొత్త పేస‌ర్లు

- Advertisement -

ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోవ‌డంపై టీమిండియా మీద విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. ఎక్కువ‌గా కెప్టెన్ విరాట్‌నే టార్గెట్ చేసుకొని కామెంట్లు వ‌స్తున్నాయి. రెండు టెస్టుల‌లో భార‌త్‌కు గెలిచే అవ‌కాశాలు ఉన్నా కోహ్లీజ‌ట్టు మాత్రం వాటిని వినియోగించుకోలేక పోయింది. బౌల‌ర్లు అద్భుతంగా రానించినా బ్యాట్స్‌మేన్‌ల వైఫ‌ల్యంతోనే సిరీస్‌ను ఇండియా చేజార్చుకుంది. మైట్ వాష్ కాకుండా భార‌త జ‌ట్టు ప‌ట్టుద‌ల‌తో ఉంది.

పేస్ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీల‌కు పిలుపునిచ్చింది. సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లో భారత బ్యాటింగ్ దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలం కావడం పట్ల కోహ్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. దీంతో నెట్ సెషన్లో బ్యాట్స్‌మెన్‌కు సహకరించడం కోసం ఈ ఇద్దరు పేసర్లకు పిలుపునిచ్చారు. నెట్ సెషన్లో బ్యాట్స్‌మెన్ మరింతగా శ్రమించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది.

ప్రాక్టీస్‌ సమయంలో భారత బ్యాట్స్‌మెన్ నాణ్యమైన బౌలర్లను ఎదుర్కోవడం లేదు. దక్షిణాఫ్రికా గడ్డ మీదకు వచ్చినప్పుడు మాతో ఉన్న నలుగురు బౌలర్లను వెనక్కి పంపాం. కానీ సైనీ, ఠాకూర్‌ లాంటి బౌలర్లు తమతో ఉంటే బాగుంటుందని భావించామని బీసీసీఐ అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -