Thursday, May 2, 2024
- Advertisement -

ఐదో వ‌న్డేలో భార‌త్ ఘ‌న‌విజయం…3-1తేడాతో వ‌న్డే సిరీస్ కైవ‌సం

- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. తిరువ‌నంత పురంలో జరిగిన ఐదో వ‌న్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని న‌మోదు చేసింది. 3-1 తో సిరీస్‌ను గెలిచింది. తొలుత బౌలర్లు రవీంద్ర జడేజా (4/34), బుమ్రా (2/11), ఖలీల్ (2/29) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

105 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన భారత్ ధావన్‌ వికెట్‌ను కోల్పోయింది. రోహిత్ శర్మ (63 నాటౌట్: 56 బంతుల్లో 5×4, 4×6), విరాట్ కోహ్లి (33 నాటౌట్: 29 బంతుల్లో 6×4) దూకుడుగా ఆడటంతో భారత్ జట్టు 14.5 ఓవర్లలోనే 105/1తో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. ఐదో వన్డేల ఈ సిరీస్‌ని భారత్ జట్టు 3-1తో చేజిక్కించుకుంది. వైజాగ్ వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే.

టాస్ గెలిచి ఫిల్డీంగ్‌ను ఎంచుకున్న విండీస్ ఆదిలోనే ఎదురు దెబ్బ‌లు త‌గిలింది. తొలి ఓవర్‌లోనే కీరన్ పొవెల్ (0)ని ఔట్ చేసి భువీ ఆ జట్టుకి షాకివ్వగా.. రెండో ఓవర్‌లో షై హోప్(0)ని బుమ్రా బుట్టలో వేసేయడంతో ఆ జట్టు 2/2తో ఒత్తిడిలో పడిపోయింది. ఈ దశలో మార్లోన్ శామ్యూల్స్ (24: 38 బంతుల్లో 3×4, 1×6), రొమన్ పొవెల్ (16: 39 బంతుల్లో 1×4),కెప్టెన్ జేసన్ హోల్డర్ (25: 33 బంతుల్లో 2×4) కాసేపు నిలకడగా ఆడినా.. రవీంద్ర జడేజా బౌలింగ్‌కి రావడంతో సీన్ మారిపోయింది. ఒక ఎండ్‌లో జడేజా వరుసగా వికెట్లు పడగొడుతూ రాగా.. మరో ఎండ్‌ నుంచి ఖలీల్ అహ్మద్, బుమ్రా, నుంచి అతనికి సహకారం లభించింది.

జట్టు స్కోరు 53 పరుగుల వద్ద హెట్‌మెయిర్‌ నిష్క్రమించిన తర్వాత రోవ్‌మాన్‌ పావెల్‌, ఫాబియన్‌ అలెన్‌, హోల్డర్‌లు స్వల్ప విరామాల్లో పెవిలియన్‌ చేరడంతో విండీస్‌ వంద పరుగుల్ని అతికష్టం మీద చేరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -