Thursday, May 2, 2024
- Advertisement -

టాప్ ప్లేయ‌ర్లు లేకుండానే టీ 20 బ‌రిలోకి దిగుతున్న టీమిండియా….

- Advertisement -

వెస్టిండీస్‌పై 2-0తో టెస్టుల్లో గెలిచిన భారత్ జట్టు.. ఐదు వన్డేల సిరీస్‌ని కూడా 3-1తో అలవోకగా కైవ‌సం చేసుకుంది. ఇప్పుడు అదే విశ్వాసంతో టీ20 సిరీస్‌కు సిద్ద‌మైంది. ఆది వారంనుంచి ఇండియా, విండీస్ మ‌ధ్య టీ 20 ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరీస్‌లో మాత్రం కరీబియన్ టీమ్‌ని ఓడించడం టీమిండియాకు అంత సులువు కాదు. గత రెండేళ్లుగా వన్డే, టెస్టుల్లో విఫలమవుతున్న ఆ జట్టు టీ20ల్లో మాత్రం తిరుగులేని ప్రదర్శన కనబరుస్తోంది.

తాజాగా కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్ లాంటి భీకర హిట్టర్లు టీ20 జట్టులోకి రావడంతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. కాని బార‌త్ మాత్రం కెప్టెన్‌, విరాట్‌, ధోనీ లేకుండానే బ‌రిలోకి దిగుతోంది.తాజాగా కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్ లాంటి భీకర హిట్టర్లు టీ20 జట్టులోకి రావడంతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది.

మూడు టీ20ల సిరీస్‌ కోసం సెలక్టర్లు ఎంపిక చేసిన భారత్ జట్టుని ఓసారి పరిశీలిస్తే..! రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్య‌, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, నదీమ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -