Monday, April 29, 2024
- Advertisement -

సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్ భార‌త్ చేజారినా… నెంబ‌ర్ 1 ర్యాకింగ్ ప‌దిలం..

- Advertisement -

ప్రస్తుతం అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్‌ జట్టు టాప్‌ ర్యాంకులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌ 124 రేటింగ్‌ పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతుండగా, ఇక‍్కడ దక్షిణాఫ్రికా 111 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది . ప్ర‌స్తుతం సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయినా టీమిండియా ర్యాంక్ ప‌దిలంగానే ఉండ‌నుంది.

కేప్‌ టౌన్ వేదికగా రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి తొలి టెస్టు ప్రారంభకానుంది. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ జట్టు 124 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 111 పాయింట్లతో దక్షిణాఫ్రికా ద్వితీయ స్థానంలో ఉంది. తర్వాత వరుసగా ఇంగ్లాండ్ (105), న్యూజిలాండ్ (100), ఆస్ట్రేలియా (97) టాప్-5లో కొనసాగుతున్నాయి.

భారత్ జట్టు ఒకవేళ సిరీస్‌ని 0-3తో చేజార్చుకుంటే.. ఆరు పాయింట్లలో కోత పడి 118 పాయింట్లకి చేరుతుంది. మరోవైపు సొంతగడ్డపై, నెం.1 జట్టుగా ఉన్న భారత్‌ని క్లీన్‌స్వీప్ చేయడంతో దక్షిణాఫ్రికా ఖాతాలో ఏడు పాయింట్లు చేరనున్నాయి. దీంతో ఇరు జట్లు 118 పాయింట్లతో సమానంగా నిలిచినా.. దశాంశాల పరంగా దక్షిణాఫ్రికా 117.53తో పోలిస్తే భారత్‌ జట్టే 118.47తో మెరుగ్గా ఉండనుంది. కాబట్టి.. ఒకవేళ సిరీస్‌‌లో భారత్ వైట్‌వాష్‌కి గురైనా.. నెం.1 ర్యాంక్‌ మాత్రం పదిలంగా ఉంచుకోనుంది.

టీమిండియా వైట్‌వాష్‌ అయిన క్రమంలో ఇరు జట్లు 118 పాయింట్లతో సమంగా ఉంటాయి. అయినప్పటికీ స్వల్ప తేడాతో భారత్‌ టాప్‌ ర్యాంక్‌లోనే కొనసాగనుంది. అదే సమయంలో కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే 128 పాయింట్లతో టాప్‌ను మరింత పదిలం చేసుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -