Monday, April 29, 2024
- Advertisement -

రాయిడిని ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై స్పందించిన చీఫ్ సెల‌క్ట‌ర్ఎ మ్మెస్కే ప్రసాద్‌

- Advertisement -

వచ్చే నెల 30 నుంచి ఇంగ్లండ్‌ వేదిక జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత క్రికెట్‌ జట్టును సెలక్టర్లు ప్ర‌క‌టించారు. జ‌ట్టులో మార్పులు పెద్ద‌గా లేక‌పోయినా జట్టులో అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌లను పక్కక పెట్టడంతో పాటు విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశారు. రాయుడిని ఎంపిక చేయ‌ప‌కోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌టంతో చీఫ్ సెల‌క్ట‌ర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్ స్పందించారు.

రెండేళ్ల క్రితం జరిగిన చాంపియన్‌​ ట్రోఫీ అనంతరమే ప్రపంచకప్‌ వేట ప్రారంభించామని తెలిపాడు. ప్ర‌స్తుతం జ‌ట్టు స‌మ‌తూకంతో ఉంద‌న్నారు. రెండు సంత్స‌రాల‌నుంచి మిడిల్ ఆర్డ‌ర్‌పై దృష్టి సారించామ‌ని తెలిపారు. జట్టును ఎంపిక చేసేటప్పుడు అంబటి రాయుడు, విజయ్‌ శంకర్‌లలో ఎవరిని తీసుకోవాలనే మీద తీవ్ర చర్చ జరిగిందని, చివరికి శంకర్‌ వైపే మొగ్గు చూపామని ఎమ్మెస్కే వివరించాడు.

నాలుగో స్థానం కోసం రాయుడు, శంకర్‌లకు పలు అవకాశాలు ఇచ్చాం. అయితే శంకర్‌ మూడు రకాలుగా ఉపయోగపడతాడు. శంకర్‌ బ్యాటింగ్‌, బౌలింగే కాదు మంచి ఫీల్డర్‌ కూడా. దీంతో శంకర్‌ వైపే మొగ్గు చూపాం. అంతేకాకుండా టీమిండియా చివరి రెండు సిరీస్‌లలో శంకర్‌ ఎంతగానో ఆకట్టుకున్నాడు. అందుకే శంక‌ర్‌ను ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేశామ‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -