Tuesday, May 7, 2024
- Advertisement -

ఐదు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన స‌ఫారీలు..

- Advertisement -

భారత అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం ఆసన్నమైంది. వరల్డ్‌కప్ ఫెవరెట్‌గా ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టిన కోహ్లీ సేన, దక్షిణాఫ్రికా తన తొలి మ్యాచ్‌లో నేడు తలబడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స‌ఫారీల‌కు ఇండియ‌న్ బౌల‌ర్లు చుక్క‌లు చూపిస్తున్నారు. క‌ట్టి దిట్ట‌మైన బంతుల‌తో సౌతాఫ్రికాను ఎక్కువ స్కోరు చేయ‌కుండా క‌ట్ట‌డి చేస్తున్నారు.

బ్యాటింగ్ ప్రారంభించిన స‌ఫారీల‌ను ఆదిలోనె బూమ్రా చావుదెబ్బ తీశాడు. వరుస ఓవర్లలో ఓపెనర్లు హసీమ్ ఆమ్లా (6), డికాక్ (10) వికెట్లను పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా.. దక్షిణాఫ్రికాని ఒత్తిడిలోకి నెట్టాడు.ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ డుప్లెసిస్ (33 నాటౌట్: 47 బంతుల్లో 4×4) బాధ్యతాయుతంగా ఆడుతుండగా.. అతనికి దుస్సెన్ (15 నాటౌట్: 23 బంతుల్లో 1×4) సహకారం అందిస్తున్నాడు.

డుప్లెసిస్, వాన్ డర్ డుస్సెన్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 11 ఓవర్ల నుంచి హార్దిక్ పాండ్య, చాహల్, కుల్దీప్‌లతో విరాట్ కోహ్లీ బౌలింగ్ వేయించాడు. బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడకపోగా.. వికెట్ కాపాడుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఐతే 11 ఓవర్ల నుంచి హార్దిక్ పాండ్య, చాహల్, కుల్దీప్‌లతో విరాట్ కోహ్లీ బౌలింగ్ వేయించాడు. బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడకపోగా.. వికెట్ కాపాడుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మిల్లర్(4), డుమిని(3)లు ఇన్నీంగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప‌నిలో ఉన్న స‌మ‌యంలో క‌ల్దీప్ యాద‌వ్ చ‌క్క‌ని బంతితితో డుమిని (3) పెవిలియ‌న్‌కు పంపించాడు. కుల్దీప్ వేసిన బంతిక ఎల్బీ రూపంలో 89 ప‌రుగుల వ‌ద్ద డుమిని 3 ఔట్ అయ్యాడు. ప్ర‌స్తుతం క్రీజులో డేవిడ్ మిల్ల‌ర్ (15) ,ఫెలుక్వాయో (7) ప‌రుగుల‌తో ఉన్నారు. ప్ర‌స్తుతం స‌ఫారీలు 27 ఓవ‌ర్ల‌కు ఐదు వికెట్లు కోల్పోయి 107ప‌రుగులు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -