Thursday, May 9, 2024
- Advertisement -

స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల ముందు చేతులెత్తేసిన ముంబ‌య్ ఇండియ‌న్స్‌

- Advertisement -

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన విజయాన్ని దక్కించుకుంది. బ్యాటింగ్‌ వైఫల్యం తర్వాత ఏమాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో బౌలింగ్‌తో చెలరేగి కీలక గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల ముందు రోహిత్‌సేన చేసేదిలేక చేతులెత్తేసింది. మ్యాచ్ గెలిచి స‌చిన్‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాల‌నుకున్న రోహిత్ సేన‌కు నిరాశ త‌ప్ప‌లేదు.

వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేవలం 119 పరుగుల లక్ష్యాన్ని అద్భుత బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ కాపాడుకుని 31 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 18.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. విలియమ్సన్‌ (21 బంతుల్లో 29; 5 ఫోర్లు), యూసుఫ్‌ పఠాన్‌ (33 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మోస్తరు ప్రదర్శన చేశారు. మయాంక్‌ మార్కండే, హార్దిక్‌ పాండ్యా, మెక్లీనగన్‌ పొదుపైన బౌలింగ్‌తో పాటు తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 18.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది.

స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఇన్నింగ్స్‌ కూడా తడబాటుతో ప్రారంభమైంది. భువనేశ్వర్‌ లేకపోయినా సన్‌రైజర్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని నిలువరించింది. సూర్యకుమార్ యాదవ్ (34: 38 బంతుల్లో 4×4), క్రునాల్ పాండ్య (24: 20 బంతుల్లో 4×4) మినహా ఎవరూ మెరుగైన స్కోరు చేయలేకపోయారు. చాలాసేపు క్రీజులో నిలిచిన హిట్టర్ హార్దిక్ పాండ్య (3: 19 బంతుల్లో) ఘోరంగా విఫలమవడం ముంబయి విజయావకాశాల్ని దెబ్బతీసింది. హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో ఆలౌటవగా.. ముంబయి 18.5 ఓవర్లలో కుప్పకూలడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -