Friday, May 3, 2024
- Advertisement -

వరుస ఓటములపై విరాట్ ఏమన్నాడంటే..?

- Advertisement -

ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీకి టైం అస్సలు కలసి రావడంలేదు. ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని నమోదు చేయడానికి నానా కష్టాలు పడుతున్నా విజయం మాత్రం వరించలేదు. జట్టులో స్టార్ బ్యాట్ష్ మేన్ లు ఉన్నా ఒక్కరు కూడా జట్టును విజయతీరాలకు చేర్చలేక పోతున్నారు. ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాఛ్ లో నైనా విజయం సాధిస్తారనుకుంటే అపజయాన్ని మూటగట్టుకున్నారు. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది.వరుసు ఓటములపై కోహ్లీ స్పందించాడు.

వరుస ఓటములతో ప్లే ఆఫ్ చాన్స్ ను దాదాపు వదిలేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శలపై కెప్టెన్ విరాట్ స్పందిస్తూ…నిత్యమూ ఓటమికి కారణాలు చెప్పీ, చెప్పీ అలసిపోయానని, ఇక ఫ్యాన్స్ ను క్షమాపణలు కూడా అడగబోనని నిర్వేదంగా అన్నాడు. మరోరోజు తమది కాకుండా పోయిందని, వచ్చిన అవకాశాలను వదిలేసుకున్నామని చెప్పాడు. ఈ సీజన్ లో తమ జట్టు దారుణాతి దారుణంగా మాత్రం ఆడలేదని, అయితే, అన్ని మ్యాచ్ లలోనూ దురదృష్టమే వెన్నాడిందని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ లో ఆడిన ఆరు మ్యాచ్ లలో ఓడిపోయిన ఏకైక జట్టుగా ఆర్సీబీ నిలిచింది.

ఏకాగ్రత దెబ్బతింటే మ్యాచ్‌ మీద దృష్టి పెట్టడం అసాధ్యం. మ్యాచులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మేం ముందుగానే సూచించాం. కానీ అది జరగలేదు. జట్టుకు మీరు సూచించడానికి ఇంకా ఏం లేవు. జట్టుగా ఆటను ఆస్వాదించాలి. లేకపోతే క్రికెట్‌ ఆడలేం అని చెప్పుకొచ్చారు కోహ్లీ. మంచి ప్లేయర్స్ ఉన్న ఈ జట్టు.. ఇకనైనా తేరుకొని కొన్ని మ్యాచ్‌లు గెలిచైనా పరువు నిలుపుకుంటుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -