Sunday, April 28, 2024
- Advertisement -

బెంగులూరు చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన కింగ్స్ పంజాబ్‌…

- Advertisement -

ఐపీఎల్‌ ఆరంభం నుంచి బ్యాటింగ్‌లో ఇద్దరినే నమ్ముకొని విజయాలు సాధిస్తూ వచ్చిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆ ఇద్దరు విఫలమైతే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఒకే ఓవర్లో రాహుల్, గేల్‌ అవుట్‌… మూడు రనౌట్లు… ఏకంగా 29 బంతులు మిగిలి ఉండగానే ముగిసిన ఇన్నింగ్స్‌… 52 పరుగుల వ్యవధిలో పడిన 10 వికెట్లు… ఫలితంగా అశ్విన్‌ బృందానికి ఘోర పరాభవం త‌ప్ప‌లేదు.

ఇక బెంగులూరు విష‌యానికి వ‌స్తే ఈ సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లీజ‌ట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. ఇండోర్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలర్లు చెలరేగడంతో పంజాబ్‌ జట్టుని 15.1 ఓవర్లలోనే 88 పరుగులకు కుప్పకూల్చిన బెంగళూరు జట్టు.. ఛేదనలో ఆర్‌సీబీ 8.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 92 పరుగులు సాధించింది. కోహ్లి (28 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), పార్థివ్‌ పటేల్‌ (22 బంతుల్లో 40 నాటౌట్‌; 7 ఫోర్లు) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. వీరిద్దరి ధాటికి 49 బంతుల్లోనే విజయం ఆర్‌సీబీ సొంతమైంది.

మొత్తంగా ఆరోది. 2018 సీజన్‌లో ఓ జట్టు పది వికెట్ల తేడాతో గెలుపొందడం ఇదే తొలిసారి. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్‌కి చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం కోల్‌కతా, రాజస్థాన్, బెంగళూరుతో పాటు పంజాబ్‌ పోటీపడుతున్నాయి. టోర్నీ జరుగుతున్న తీరు చూస్తుంటే.. ఒకవేళ మిగిలిన రెండు మ్యా ఒకవేళ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ముంబయి గెలిస్తే.. ప్రస్తుతం 10 పాయింట్లతో ఉన్న ఆ జట్టు కూడా రేసులో నిలిచే అవకాశం ఉంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -