Friday, May 10, 2024
- Advertisement -

ష‌మీకి షాక్‌..గృహ హింస కేస‌లో కోల్‌కతా పోలీసుల సమన్లు

- Advertisement -

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీకి ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించటం లేదు. తాజాగా మొహమ్మద్ షమికి కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. బుధవారం (ఏప్రిల్ 18) మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. గృహహింస చట్టం 2005 కింద ష‌మీ భార్య హసీన్ జహాన్ అలీపూర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విచారణకు తమ ఎదుట హాజరు కావాలంటూ షమీకి పోలీసులు సమన్లు పంపారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు హాజరు కావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు.

బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా షమిపై జహాన్ ఫిర్యాదు చేసింది. ఈ కేసును సత్వరమే విచారించాలని కోల్‌కతా హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. కేసు నడుస్తుండగానే తనకు నెలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని హసీన్ జహాన్ డిమాండ్ చేసింది. అందులో రూ. 7 లక్షలు కుటుంబ నిర్వహణకు, మరో రూ. 3 లక్షలు కూతురు కోసం అని పేర్కొంది.

షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనను మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని జహాన్‌ ఆరోపణలు చేసింది విదితమే. గృహ హింస చట్టం కింద షమీతో పాటు, అతని కుటుంబ సభ్యులపై కోల్‌కతా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం షమీ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -