Tuesday, May 7, 2024
- Advertisement -

ష‌మీ దుబాయ్‌లో రెండు రోజులున్నాడు కోల్‌క‌తా పోలీసుల‌కు తెలిపిన బీసీసీఐ

- Advertisement -

గత ఫిబ్రవరిలో టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమీ దుబాయ్‌ లో రెండు రోజులు గడిపాడని బీసీసీఐ కోల్ కతా పోలీసులకు సమాచారమిచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని భారత్ రావాల్సిన షమీ, దుబాయ్ వెళ్లాడని, అక్కడ పాకిస్థాన్‌ కు చెందిన అలిష్బా అనే మహిళ నుంచి డబ్బులు తీసుకున్నాడని షమీ భార్య హసీన్‌ జహాన్‌ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ ఆరంభించిన కోల్ కతా పోలీసులు, షమీ పర్యటన వివరాలు ఇవ్వలంటూ బీసీసీఐకి లేఖ రాశారు. దానికి స్పందించిన బీసీసీఐ, షమీ పర్యటన వివరాలు కోల్ కతా పోలీసులకు అందించింది.

బీసీసీఐ నుంచి లెటర్‌ని మేము అందుకున్నాం. అందులో.. మహ్మద్ షమీ గత ఫిబ్రవరి 17, 18న దుబాయ్‌లోనే ఉన్నట్లు స్పష్టంగా ఉంది. ఇక ఈ కేసుకి సంబంధించిన మిగతా అంశాలపై విచారణ కొనసాగిస్తాం’ అని జాయింట్ సీపీ (నేర విభాగం) ప్రవీణ్ త్రిపాఠి మీడియాతో వెల్లడించారు. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ముగియగానే.. వన్డే, టీ20 జట్టులో తాను లేకపోవడంతో సుదీర్ఘ పర్యటన మధ్యలోనే మహ్మద్ షమీ భారత్‌కి వచ్చేశాడు. అయితే.. ఈ ప్రయాణం మధ్యలోనే అతను దుబాయ్‌కి వెళ్లినట్లు అతని భార్య ఆరోపించడంతో.. పోలీసులు వివరాల కోసం బీసీసీఐకి లేఖ రాశారు. ఈ పర్యటన ఖర్చు బీసీసీఐ భరించిందా..? లేదా మహ్మద్ షమీనే పెట్టుకున్నాడా..? అనే వివరాలను మాత్రం తెలియరాలేదు.

షమీ కుటుంబ సభ్యులు తనకు నిద్రమాత్రలు ఇచ్చి హతమార్చే ప్రయత్నం చేశారన్న హసీన్ జహాన్ ఆరోపణలపై విచారణ ప్రారంభించినట్టు బీసీసీఐ తెలిపింది. ఆ సమయంలో ఆమెకు చికిత్స చేసిన వైద్యుడిని బీసీసీఐ అధికారులు కలవనున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -