Tuesday, May 7, 2024
- Advertisement -

కాషాయి కండువా క‌ప్పుకోనున్న మ‌రో స్టార్ క్రికెట‌ర్‌…

- Advertisement -

టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ వ్యవహారంపై ఇప్పుడు హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత ధోని రిటైర్మెంట్ తీసుకుంటార‌నె వార్త‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. అయితే వార్త‌ల‌ను దోని కండించారు. తానెప్పుడు రిటైర్‌ అవుతానో తనకే స్పష్టత లేదని మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తాజాగా ప్రకటించాడు. అయితే .. ప్రపంచకప్‌ తర్వాత ధోనీ రిటైర్మెంట్‌ గ్యారంటీ అనే కథనాలు జోరుగా ప్రచారమవుతున్నాయి.

రిటైర్మెంట్ ప‌క్క‌న పెడితే…రిటైర్మెంట్‌ తర్వాత ధోనీ రాజకీయాల్లో చేరుతాడనే ప్రచారం వినిపిస్తోంది. బీజేపీ అభిమానులు సోషల్ మీడియాల్లో ఈ ప్రచారానికి తెరలేపారు. బీజేపీ చీఫ్ అమిత్‌షాతో ధోనీ కలిసివున్న ఫోటోలను షేర్ చేసి.. ఇదిగో ధోనీ వచ్చేస్తున్నాడంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

అక్టోబర్‌లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ధోని పాపులారిటీని ఉప‌యోగించుకోవాల‌ని భాజాపా అధిష్టానం పావులు క‌దుపుతోంది. సండే గార్డియన్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి రాగానే ధోనీ బీజేపీలో చేరుతాడని విశ్వసనీయవర్గాల సమాచారం అంటూ ఆ కథనంలో వెల్లడించింది.

బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఉండడం.. ముఖ్యంగా గిరిజనుల్లో అసంతృప్తి నెలకొని ఉండడంతో.. ధోనీ పాపులారిటీని ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని. జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడానికి జార్ఖండ్‌లో ధోనీ ప్రజాదరణను వాడుకోవాలని బీజేపీ భావిస్తోందని.. ఒక వేళ తమ పార్టీలో చేరడానికి ధోనీ ఇష్టపడక పోతే కనీసం ప్రచారానికైనా ఉపయోగించుకోవాలని ఆ పార్టీ నాయకత్వం ఆలోచ‌న‌లో ఉంది. మ‌రి భాజాపా గాలానికి ధోని చిక్కుతారా ….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -