Tuesday, May 7, 2024
- Advertisement -

కాన్పూర్‌లో జ‌రిగే మూడో వ‌న్డేలో రాణించాల‌ని ఆశిస్తున్నాం…న్యూజిలాండ్ కెప్టెన్ విలియ‌మ్స్‌న్‌

- Advertisement -

న్యూజిలాండ్‌ స్వీప్‌ జోరుకు విజయవంతంగా అడ్డుకట్ట వేసిన టీమ్‌ఇండియా రెండో వన్డే సిరీస్‌లో జోరందుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కోహ్లీసేన 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. అయితె ఓట‌మిపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ అన్నారు.

టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడం వల్లే రెండో వన్డేలో తాము ఓడిపోయామని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నారు. అదే సమయంలో భారత బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రారంభంలోనే వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారని అన్నారు.

భారత ఓపెనింగ్‌ బౌలర్లు చాలా బాగా ఆడారు. సరైన లెంథ్‌తో బౌలింగ్‌ చేస్తూ వికెట్లు సాధించార‌న్నారు. ఈ మ్యాచ్‌ నుంచి మేం పాఠాలు నేర్చుకోవాలి’ అని విలియమ్సన్‌ అభిప్రాయపడ్డారు. మొదటి వన్డే గెలుపు ఉత్సాహంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను రెండో వన్డేలో భారత్‌ కట్టడి చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్‌ జట్టు 9 వికెట్లకు 230 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా అందుకున్న టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

టీమిండియా ను ఓడించాలంటే మేం మెరుగ్గా ఆడాలన్న విషయం మాకు తెలుసునన్నారు. ముంబైలో మంచి ప్రదర్శన ఇచ్చాం. (మూడో వన్డే జరిగే) కాన్పూర్‌లో మెరుగ్గా రాణించాలని ఆశిస్తున్నాం’ అని మ్యాచ్‌ అనంతరం విలియమ్సన్‌ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -