Thursday, May 2, 2024
- Advertisement -

బ్యాట్స్‌మన్‌లకు ఐసీసీ సలహా…

- Advertisement -

న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఐదో వ‌న్డేలో భార‌త్ 35 పరుగులతో తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. నాలుగో వ‌న్డేలో చిత్తుగా ఓడిన టీమిండియా చివ‌రి వ‌న్డేలో గాడిలో ప‌డింది. ఆ మ్యాచ్‌లో ధోని మ‌ళ్లు చెరిదే స్టంపింగ్ చేశారు. ధోనీ స్టంప్స్ వెనుక‌నుండ‌గా బ్యాట్స్‌మెన్‌లు క్రీజు వీడొద్దంటూ సూచ‌న‌లు చేసింది.

వ‌య‌సు మీద ప‌డుతున్న ధోనీ మాత్రం స్పీడ్ త‌గ్గ‌డంలేదు.వికెట్ కీపర్ గా ధోనీ చేస్తున్న కళ్లు చెదిరే డిస్మిసల్స్ చూస్తే ‘వారెవ్వా’ అనాల్సిందే. క‌ళ్లు చెదిరే స్టంపింగ్స్ చాల‌నే ఉన్నాయి. న్యూజిలాండ్ తో నిన్న జరిగిన చివరి వన్డేలో ధోనీ మెరుపు వేగానికి కివీస్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరిన తీరు అందరినీ ఆకట్టుకుంది. 44 పరుగులతో అప్పటికే నీషమ్ క్రీజులో పాతుకుపోయాడు. విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్న న్యూజిలాండ్‌కు కేదార్ అడ్డుక‌ట్ట వేశారు. జాధవ్ వేసిన బంతిని నీషమ్ మిస్ అయ్యాడు. అయితే, ఆ బంతి నీషమ్ కాలికి తాకడంతో భారత్ ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశారు. అందరూ అంపైర్‌ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ బిజీగా ఉండగా.. బంతిని అందుకున్న ధోని అప్పీల్‌ చేస్తూనే నీషమ్‌ను రనౌట్‌ చేశాడు. ఆటగాళ్ల అప్పీల్‌తో క్రీజ్‌ను వదిలి ధోనిని మరిచిన జేమ్స్‌ నీషమ్‌.. భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

కివీస్‌ విజయానికి 83 బంతుల్లో 77 పరుగులు అవసరం. దాటిగా ఆడుతూ క్రీజులో నిలదొక్కుకున్న నీషమ్‌ ధోని దెబ్బకు పెవిలియన్‌ చేరాడు. ఇది ఆతిథ్య జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఇలా వికెట్ల వెనుక చాకచక్యంగా వ్యవహరించిన ధోనిపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని ధోని విషయంలో బ్యాట్స్‌మెన్‌కు సలహా ఇవ్వండని ఐసీసీని కోరాడు. దీనికి ఐసీసీ స్పందిస్తూ.. స్టంప్స్‌ వెనుక ధోని ఉన్నాడంటే ఎప్పుడూ క్రీజ్‌ను వీడొద్దు.’ అని సమాధానం ఇచ్చింది. ఇక నీషమ్‌ రనౌట్‌పై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొందరు నీషమ్‌ను నిందిస్తూ కామెంట్స్‌ చేశారు.అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ ఇప్పటి వరకు 190 స్టంపింగ్ లు చేశాడు. అతని దరిదాపుల్లో కూడా మరెవరూ లేరు. ధోనీ తర్వాత శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (139 స్టంపింగ్ లు) ఉన్నాడు.



Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -