Saturday, April 27, 2024
- Advertisement -

రాజ్ కోట్ టెస్ట్..టీమిండియాకు గాయాల బెడదా?

- Advertisement -

ఇంగ్లాండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాజ్ కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుండి మూడో టెస్ట్ జరగనుంది. ఈ రాజ్ కోట్ పిచ్ బ్యాటర్లకు స్వర్గ ధామం. ఇక టెస్ట్‌లో టాస్ కీలకం కానుండగా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిపత్యం సాధించాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.

అయితే టీమిండియా ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. గాయం కారణంగా కేఎల్ రాహుల్ సిరీస్ మొత్తానికి దూరమైనట్లు సెలక్టర్లు ప్రకటించగా అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో కోహ్లీ సిరీస్ మెుత్తానికి దూరం కాగా.. వరుసగా విఫలమవుతున్న శ్రేయస్ అయ్యర్ ను మిగతా మూడో టెస్టులకు తప్పించారు. ఇక తొలి రెండు టెస్టులకు దూరమైన రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌ ద్వారా తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది.శ్రేయస్ స్థానంలో సర్ఫారాజ్‌ ఖాన్‌ అరంగేట్రం చేయనున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వస్తే టీమిండియాకు తిరుగు ఉండదు. ఎందుకంటే తొలి రెండు టెస్టులలో ఘోరంగా విఫలం అయ్యాడు రోహిత్. అతడిని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండగా ఈ మ్యాచ్‌లో రాణించకపోతే విమర్శకులకు మరింత టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా మూడో టెస్టులో లోపాలను సరిదిద్దుకోకపోతే టీమిండియాకు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -