Thursday, May 9, 2024
- Advertisement -

ఉత్కంఠ‌పోరులో ముంబ‌య్‌పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం…

- Advertisement -

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజస్థాన్‌తో జైపూర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేజేతులా ఓడింది. 168 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు గౌతమ్ (33 నాటౌట్: 11 బంతుల్లో 4×4, 2×6) సంచలన ఇన్నింగ్స్‌తో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

సంజూ శాంసన్‌(52), బెన్‌ స్టోక్స్‌(40), కృష్ణప్ప గౌతమ్‌(33 నాటౌట్‌)లు రాజస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లు అజింక్యా రహానే(14), రాహుల్‌ త్రిపాఠి(9)లు నిరాశపరిచినా, శాంసన్‌-స్టోక్స్‌లు కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. చివరి ఓవర్‌లో రాజస్తాన్‌ విజయానికి 10 పరుగులు కావాల్సిన తరుణంలో కృష్ణప్ప గౌతమ్‌ ఫోర్‌, సిక్సర్‌తో జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.

17.1 ఓవర్లు ముగిసే సమయానికి 125/6తో దాదాపు ముంబయి చేతుల్లోకి వెళ్లిపోయిన మ్యాచ్‌ని గౌతమ్ తీసుకొచ్చాడు. చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో హార్దిక్ పాండ్య బౌలింగ్‌ని ఎదుర్కొని ఒక ఫోర్, సిక్స్ బాదేశాడు. ఛేదనలో సంజు శాంసన్ (52: 39 బంతుల్లో 4×4), బెన్‌స్టోక్స్ (40: 27 బంతుల్లో 3×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. తాజా సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత రాజస్థాన్ మళ్లీ విజయాన్నిఅందుకుంది

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ముంబైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ లూయిస్‌ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. ఆపై మరో ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌ 129 పరుగులు జత చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -