Monday, April 29, 2024
- Advertisement -

టీమిండియాలో బౌన్స‌ర్లు సంధించే బౌల‌ర్లు లేరా….?

- Advertisement -

ద‌క్షిణాఫ్రికాతో సుదీర్ఘ ఇన్నీంగ్స్ ఆడేందుకు భార‌త జ‌ట్టు సిద్ద‌మ‌వుతోంది. ద‌క్షిణాఫ్రికా చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. అయితే స‌ఫారీల‌తో త‌ల‌ప‌డ‌టం క‌ష్టంతో కూడుకున్న ప‌నేన‌ని ప‌లువురు సీనియ‌ర్లు వ్యాఖ్యానించారు.

ఫాస్ట్ పిచ్‌ల‌పై దక్షిణాఫ్రికా బౌలర్ల సంధించే బౌన్స‌ర్ల గురించి భారత జట్టు బ్యాట్స్‌‌మెన్ అతిగా ఆందోళనపడుతున్నారనే వాదన సరికాదని టీమిండియా టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అభిప్రాయపడ్డాడు. శుక్రవారం నుంచి కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ఆరంభంకానుంది. సఫారీ జట్టులోనే కాదు.. టీమిండియాలోనూ బౌన్సర్లు సంధించగల బౌలర్లు ఉన్నారంటూ ఈ వికెట్ కీపర్ ధీమా వ్యక్తం చేశాడు.

దక్షిణాఫ్రికా పర్యటన అనగానే ప్రధానంగా పిచ్, బౌన్సర్ల గురించే అందరూ ఎక్కువగా చర్చిస్తున్నారు. సఫారీ బౌలర్లు రబాడ, స్టెయిన్, మోర్కెల్ ధాటికి భారత్ బ్యాట్స్‌మెన్ నిలవగలరా..? అంటున్నారు. ఇక్కడ వారిని తక్కువ చేసి ఏం మాట్లాడటంలేదు. కానీ.. భారత్ జట్టులోనూ బౌన్సర్లు విసరగల బౌలర్లు ఉన్నారని మర్చిపోతున్నారు.

మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ పేస్, బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టగలరు. భువనేశ్వర్ కుమార్ ఎలాంటి పిచ్‌పైనైనా మంచి పేస్, సీమ్ రాబట్టగలడు. ఇంకా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ ఇప్పటికే చాలినంత క్రికెట్ ఆడాడు.. అతనికి తెలుసు ఒక సీనియర్‌గా సఫారీ పిచ్‌లపై ఎలా బౌలింగ్ చేయాలో..? కాబట్టి.. ఇక్కడ విషయం పేస్, బౌన్స్ గురించి కాదు. 20 వికెట్లు తీయగల సమర్థత, గెలిచే సత్తా ఏ జట్టులో ఉంది..? అనే. భారత్ జట్టుకి ఆ సత్తా ఉందని నేను నమ్ముతున్నా’ అని సాహా ధీమా వ్యక్తం చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -