Tuesday, May 7, 2024
- Advertisement -

ప్రపంచకప్ ఎఫెక్ట్…కోచ్ లపై వేటు వేస్తున్న ఆయా దేశాల క్రకెట్ బోర్డులు..

- Advertisement -

ప్రపంచకప్ లో పాకిస్థాన్, లంక జట్లు వైఫల్యం చెందడంతో ఆయా దేశాల బోర్డులు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆజట్ట కోచ్ లపై వేటు వేశారు. పాక్ కోచ్ గా ఉన్న మికీ ఆర్థర్‌కు పాక్ క్రికెట్ బోర్డు ఉద్వాసన పలికింది. అతనితో పాటు బౌలింగ్‌ కోచ్‌ అజహర్‌ మహమూద్, బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ల్యూడెన్‌లను కూడా పీసీబీ తప్పించనుంది. వీరి కాంట్రాక్టు ఈనెల 15న ముగియనుండంతో ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే పీసీబీ తీసుకున్న నిర్ణయంపై మికీ ఆర్థర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కోచ్ పదవీ కాలాన్ని పొడిగించమని కోరినా పీసీబీ పట్టించుకోలేదన్నారు. పాక్ జట్టును ఉన్నత స్థాయితో తీర్చి దిద్దానని తెలిపారు. అతని పదవీకాలంలో పాక్‌ వన్డేల్లో చాంపియన్స్‌ ట్రోఫీ గెలుచుకోవడం పెద్ద ఘనత కాగా, టి20ల్లో నంబర్‌వన్‌ జట్టుగా నిలిచింది. ‘పాక్‌ క్రికెట్‌ను బాగు చేసేందుకు నా శక్తిమేరా ప్రయత్నించాను. తాజా నిర్ణయంతో చాలా బాధపడుతున్నాను’ అని ఆర్థర్‌ స్పందించాడు.

ఇక లంక బోర్డు కూడా అదే నిర్ణయాన్ని తీసుకుంది. ఆజట్టు ప్రధాన కోచ్‌ చండికా హతురుసింఘాపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు హతురుసింఘా సేవలు అందించడం లేదని బోర్డు పేర్కొంది. అతని స్థానంలో తాత్కాలిక కోచ్‌గా రుమేష్‌ రత్ననాయకేయను నియమించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -