Saturday, April 27, 2024
- Advertisement -

ఉత్కంఠ పోరులో భార‌త్ ఘ‌న‌విజ‌యం

- Advertisement -

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న 5 వ‌న్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్‌లో కూడా భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది.హైద‌రాబాద్‌లో జ‌రిగిన మొద‌టి వ‌న్డేలో కూడా భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. రెండో వ‌న్డేలో కూడా విజ‌యం సాధించి 2-0 తేడాతో లీడ్‌లో ఉంది. టాస్ గెలిచి మొద‌ట ఫిల్డింగ్ తీసుకుంది అతిథ్్య ఆసీస్ జ‌ట్టు. నిర్ణీత 50 ఓవ‌ర్లు ఆడ‌కుండానే భార‌త్ 250 ప‌రుగుల‌కు అలౌట్ అయింది. కెప్టెన్ కోహ్లీ ఒక్క‌డే నిల‌బ‌డి సెంచ‌రీ సాధించాడు. అత‌నికి తోడుగా విజ‌య్ శంక‌ర్ 46 ప‌రుగులు సాధించాడు.

251 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్‌ను 242 పరుగులకు కట్టడి చేసిన భారత్‌ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆసీస్‌ ఆటగాళ్లలో పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌(48), స్టోయినిస్‌(52), ఖవాజా(38), అరోన్‌ ఫించ్‌(37)లు ప‌రుగులు చేసిన‌ ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, విజయ్‌ శంకర్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, కేదార్‌ జాదవ్‌లకు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించడంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -