Tuesday, April 30, 2024
- Advertisement -

ఇంగ్లండ్ కౌంటీల‌కు మ్యాచ్‌ల‌కు దూరం కానున్న కోహ్లీ….

- Advertisement -

టీమిండియా కెప్టెన్ కౌంటీ క్రికెట్‌కు దూరం కానున్నాడు. త్వరలో కౌంటీల్లో ఆడేందుకు ఇంగ్లండ్‌కు పయనం కావాల్సి ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన ప్రయాణాన్ని రద్దు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సర్రే తరఫున కౌంటీల్లో ఆడటం ద్వారా ఇంగ్లాండ్ పర్యటనకు సన్నద్ధం కావాలని కోహ్లి భావించాడు. ఇప్పటికే సర్రేతో ఒప్పందం కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. కానీ వెన్నుపూస సంబంధిత సమస్య (హెర్నియేటెడ్ డిస్క్) కారణంగా కౌంటీ క్రికెట్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. కౌంటీలకు దూరంగా ఉండాలని దేశంలోని టాప్ ఆర్థోపెడిక్ సర్జన్ ఒకరు విరాట్ కోహ్లికి సలహా ఇచ్చారు.

త్వ‌ర‌లో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కైంటీలో ఆడేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. అక్క‌డ ఆడితే జూలైలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆ సర్జన్ కోహ్లిని హెచ్చరించారు.

ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన వెంటనే ఇంగ్లిష్‌ కౌంటీలు ఆడేందుకు ఇంగ్లండ్‌కు పయనం కావాలని కోహ్లి ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆగస్టు నెలలో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో తన ప్రిపరేషన్‌లో భాగంగా అక్కడ కౌంటీల్లో ఆడేందుకు కోహ్లి మొగ్గుచూపాడు. ఈ మేరకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నుంచి కూడా కోహ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అయితే తాజాగా గాయపడ్డాడనే వార్తల నేపథ్యంలో తన ఇంగ్లండ్‌ పర్యటనకు కోహ్లి ఫుల్‌స్టాప్‌ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కౌంటీల్లో ఆడటం కోసం కోహ్లి అప్ఘాన్‌తో జరగనున్న చార్రితక టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నాడు. కానీ గాయం కారణంగా కౌంటీ క్రికెట్‌కు కూడా దూరం అవుతున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కౌంటీల్లో తాను ఆడబోవడం లేదని కోహ్లి ఇప్పటికే సర్రే జట్టుకు సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -