Monday, May 6, 2024
- Advertisement -

నామం పెట్టుకోవాలి , ఓం నమశ్సివాయ అని పలకరించుకోవాలి

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ లో ఏ కార్యక్రమం అయినా కూడా దాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి అనేది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. అది మంచి విషయమే కానీ అవసరం అయిన దానికంటే ఎక్కువ ఘనంగా నిర్వహించడం వలన అనవసరమైన ఖర్చు ఎందుకు అంటూ ఉంటారు విశ్లేషకులు, ఇప్పటికే ఉన్న ఆర్ధిక భారం సరిపోదు అన్నట్టు ఈ హడావిడి ఎక్కువ అవుతోంది.

ఇప్పుడు ఒక కొత్త రూల్ ని తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం . కృష్ణా పుష్కరాల సందర్భంగా చాలా మంది ప్రభుత్వం ఉద్యోగులకి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. పుష్కరాలకి తరలి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని ప్రభుత్వం చెబుతోంది. భక్తులని ఆప్యాయంగా పలకరించాలి అనీ ఎక్కడా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అనీ అంటున్నారు.

అలాగే డ్రెస్ కోడ్ కూడా పాటించాలి అని హుకుం జారీ చేసింది. పురుషులు తెల్లని పంచెలు కట్టుకోగా మహిళా ఉద్యోగులు తప్పనిసరిగా చీరలు కట్టుకుని మాత్రమె విధులు నిర్వహించాలి అంటున్నారు. పురుషులు నామాలు కూడా పెట్టుకోవాలత. భక్తులని పలకరించేటప్పుడు ఓం నమశ్శివాయ అని పలకరించాలి అని కూడా చెబుతున్నారు.

Related

  1. చంద్రబాబు కి ఆమె హ్యాండ్ ఇచ్చింది
  2. కోదండరాం ని చూసి టీడీపీ బుద్ధి తెచ్చుకోవాలి – చంద్రబాబు
  3. రోజుకొక మాట మారుస్తూ అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు
  4. చంద్రబాబు పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ?
  5. అతని మీద చంద్రబాబు కి ఎందుకు అంత కోపం ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -