Tuesday, April 30, 2024
- Advertisement -

రోజుకొక మాట మారుస్తూ అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు

- Advertisement -

రాజకీయాలలో ఉన్న వారికి రోజుకి ఒక రకంగా మాట్లాడ్డం పెద్ద కొత్త వ్యవహారం ఏమీ కాదు. ఇవాళ చెప్పిన మాట రేపటికి మారిపోయి ఎల్లుండి మరొక కొత్త మాట నోట్లోంచి వస్తుంది.

గతం గుర్తు చేసుకునే రాజకీయ నాయకులు ఎందుకు తలుచుకున్నామా అని ఫీల్ అవుతూ ఉంటారు. గతం గుర్తు లేనట్టే చాలా మంది ప్రవర్తిస్తూ ఉంటారు కూడా. తెలుగు దేశం పార్టీ , ఏపీ ముఖ్యమంత్రి నేత చంద్రబాబు నాయుడు ఈ విషయం లో కింగ్ అని చెప్పాలి. ఆయనకి గతం అనేది అస్సలు గుర్తు ఉండనే ఉండదు. గతం లో సాధించడం కోసం పోరాడిన సమస్యలు ఆయకి గుర్తు కూడా ఉండవు, ఆయన ఈ విషయం మీద స్పందించాలి అనుకోనిది సడన్ గా గుర్తొస్తుంది. అందుకు అతిపెద్ద ఉదాహ‌ర‌ణ‌… మ‌చిలీప‌ట్నం ఓడ‌రేవు భూసేక‌ర‌ణ ఇష్యూ! గ‌తం త‌రువాత మాట్లాడుకుందాం. 

ప్ర‌స్తుతం మ‌చిలీప‌ట్నం ఓడ‌రేవు నిర్మాణానికి భారీ ఎత్తున భూమిని సేక‌రించేందుకు తెలుగుదేశం స‌ర్కారు సిద్ధ‌మౌతున్న‌ట్టుగా ఉంది. ఆ ఓడ‌రేవు కోసం ఏకంగా ల‌క్షా ఐదు వేల ఎక‌రాల భూమిని సేక‌రించేందుకు చంద్ర‌బాబు స‌ర్కారు సిద్ధంగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఎంత అభివృద్ధి అయితే మాత్రం… ఏకంగా ల‌క్ష‌ల ఎక‌రాల్లో భూమి సేక‌రించాల్సిన అస‌వ‌రం ఏముంద‌నేది ప్ర‌జ‌ల ఆందోళ‌న‌. మ‌చిలీప‌ట్నం ఓడ‌రేవు అద్భుతంగా డెవ‌ల‌ప్ కావాల‌నీ… తద్వారా రాష్ట్రం అభివృద్ధి అవుతుంద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. అయితే, అభివృద్ధిని ఎవ్వ‌రూ వ్య‌తిరేకించ‌రు. ప‌రిశ్ర‌మ‌లు రావాలి, ఉపాధి అవ‌కాశాలు పెర‌గాలి, ఆర్థికంగా ఆంధ్రా ఎంతో పురోగ‌తి సాధించాలి. కానీ, దాని పేరుతో ల‌క్ష‌ల ఎక‌ర‌కాల భూమిని పూలింగ్ చేయాల్సిన అవ‌స‌రాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించి చెప్పాల్సిన బాధ్య‌త ఒక‌టి ఉంటుంది క‌దా! 

ఇక‌, గ‌తానికి వెళ్తే… ఇదే మ‌చిలీప‌ట్నం ఓడ‌రేవు అభివృద్ధి కోసం అప్ప‌టి ముఖ్య‌మంత్రి దివంగ‌త వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. భూసేక‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నం చేసింది. అప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు… భూసేక‌ర‌ణను వ్య‌తిరేకించారు. భూమి కోల్పోతున్న రైతుల త‌ర‌ఫున నిల‌బ‌డి పోరాటం చేశారు. బంద‌రు పోర్టు అభివృద్ధికి 1200 ఎక‌రాలు స‌రిపోతాయ‌ని అన్నారు. వైయ‌స్ స‌ర్కారు అడ్డ‌గోలుగా భూసేక‌ర‌ణ‌కు పాల్ప‌డుతోంద‌ని నాడు విమ‌ర్శ‌లు చేశాడు. బంద‌రు కోనేరు సెంట‌ర్ ముందు ఆయ‌న చేసిన ఆందోళ‌న చాలామందికి గుర్తుండే ఉంటుంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కేవ‌లం 1200 ఎక‌రాల భూమి చాలు అని చెప్పిన చంద్ర‌బాబు నాయుడు… ఇప్పుడు అధికారంలోకి రాగానే ల‌క్ష‌ల ఎక‌రాలు ఉంటేగానీ అభివృద్ధి సాధ్యం కాద‌న్న‌ట్టు మాట్లాడుతూ ఉండ‌టం ఏంట‌నేదే సామాన్యుడి ప్ర‌శ్న‌. గ‌తం ఆయ‌న మ‌ర‌చిపోవ‌చ్చు, కానీ సామాన్యుల్లో చాలామందికి గుర్తుంటుంది క‌దా!

Related

  1. చంద్రబాబు పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ?
  2. అతని మీద చంద్రబాబు కి ఎందుకు అంత కోపం ?
  3. మోడీ చేసిన పనికి డీలా పడిపోయిన చంద్రబాబు
  4. చంద్రబాబు కోసం డైలాగ్స్ రాస్తున్న పరుచూరి బ్రదర్స్ 
  5. జగన్ ” గడపగడపకు ” vs చంద్రబాబు ” వంద ప్రశ్నలు “

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -