Thursday, May 2, 2024
- Advertisement -

‘RRR’లో ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్ లుక్‌లు ఇవేన‌ట‌..!

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సినిమా RRR(వ‌ర్కింగ్ టైటిల్‌). ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి సినిమా త‌రువాత తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. టాలీవుడ్ టాప్ హీరోలు అయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు ఈ సినిమాలో హీరోలుగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. ఎన్టీఆర్ , రామ్ చ‌ర‌ణ్‌లకు సంబంధించిన కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ముందుగా సినిమాలోని ఫైట్స్‌ను షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు స‌బంధించి మీడియా స‌మావేశం పెట్టారు రాజ‌మౌళి.

ఈ మీడియా స‌మావేశానికి రాజ‌మౌళ‌తో పాటు హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ , నిర్మాత డివివి దాన‌య్య‌లు కూడా హాజ‌రైయ్యారు. ఈ మీడియా సమావేశంలో ఇటు ఎన్టీఆర్‌, అటు రామ్ చ‌ర‌ణ్‌లు ఇద్ద‌రు డిఫ‌రెంట్ లుక్స్‌లో ద‌ర్శ‌నం ఇచ్చారు. రామ్ చ‌ర‌ణ్ ఫుల్‌గా మీసాల‌ను పెంచేసి క‌నిపించ‌గా, ఎన్టీఆర్ ఫుల్ గెడ్డంతో క‌నిపించారు. దీంతో సినిమాలోని వీరిద్ద‌రు లుక్స్ ఇవేన‌ని ఫిక్స్ అయిపోయారు వారి అభిమానులు. ఇక ఈ సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్లను ఎంపిక చేయ‌లేదు. మార్కెట్ దృష్ట్యా బాలీవుడ్ హీరోయిన్స్‌ను తీసుకుందమ‌ని ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప‌రిణితి చోప్రా, అలియా భ‌ట్‌ల‌ను ఈ సినిమాలో హీరోయిన్స్‌కు తీసుకునే ఆలోచ‌న‌ట చేస్తున్నాడ‌ట రాజ‌మౌళి. సినిమాను 2020 చివ‌ర్లో విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -