మహేష్, వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే..!

740
Mahesh Upset with Vamshi Paidipallys experimental story
Mahesh Upset with Vamshi Paidipallys experimental story

మహేష్, వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన మహర్షి సినిమా కమర్షియల్ గా హిట్ అనిపించుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఊపిరి సినిమాతో దర్శకుడిగా ఓ మెట్టు ఎక్కినప్పటికి మహర్షితో మాత్రం ప్రశంసలు అందుకోలేదు.

కేవలం మహేష్ తప్ప అతడిని ఎవరు ప్రత్యేకించి అభినందించలేదు. అయితే ప్రస్తుతం మహేష్ ప్రయోగాలకి సిద్ధంగా లేడు. మహర్షి, సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రాలు మాత్రమే చేద్దాం అనుకుంటున్నాడు. వంశి పైడిపల్లి కూడా తన కోసం అలాంటి కథనే తీసుకుని వస్తాడని మహేష్ భావించాడు. కానీ వంశి తన కథలో కమర్షియల్ అంశాలు కాకుండా కొత్తదనం కోసం ప్రయత్నించడంతో మహేష్ మళ్లీ ఆలోచనలో పడ్డాడు. అందుకే ఉన్నపళంగా ఆ సినిమాని రద్దు చేసాడట.

మహేష్ తో సినిమా ఖాయం అనుకున్న దిల్ రాజు కూడా వంశి పైడిపల్లి ఇచ్చిన ట్విస్ట్ తో బాగా హర్ట్ అయ్యాడట. మొత్తానికి ఇతర నిర్మాతలని జత చేయకుండా తనకు మహేష్ సినిమా చేయడానికి ఓకే అంటే హీరోకి నచ్చే విధంగా కథ రాసుకోకపోవడం దిల్ రాజుని కూడా అసహనానికి గురి చేసినట్లు తెలుస్తోంది.

Loading...