చరణ్ సినిమాపై నందమూరి కుట్ర…..బోయపాటి సహకారం నిజమేనా?

3269
Special Analysis on Ram Charan Vinaya Vidheya Rama Movie
Special Analysis on Ram Charan Vinaya Vidheya Rama Movie

నమ్మశక్యంకాని నిజాలు గతంలో కూడా ఎన్నో ఉన్నాయి. జిఎంసీ బాలయోగి మరణం నుంచీ వైఎస్సార్ మరణం వరకూ చాలా విషయాలు ఇప్పటికీ సందేహాస్పదంగా ఉన్నాయి. ఇప్పుడు చరణ్ సినిమా విషయంలో బోయపాటి శల్యసారథ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా రిలీజ్‌కి ముందు నుంచే ఈ తరహా అనుమానాలు మెగాభిమానులు, మెగా ఫ్యామిలీ నుంచే వచ్చాయి. ఈ రోజు సినిమా రిలీజ్ అయింది. సినిమా పోవడం ఎలా ఉన్నా కెరీర్‌లోనే ఫస్ట్ టైం మాస్ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్‌పైన కూడా విమర్శలు వస్తున్నాయి. మామూలుగా అయితే మాస్ సినిమాలకు చరణ్ పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంది. రంగస్థలం లాంటి సినిమాతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.

అయితే బోయపాటి మాత్రం చరణ్ పెర్ఫార్మెన్స్‌ని నెగ్లెక్ట్ చేశాడని మెగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. బాలయ్యతో బోయపాటి అనుబంధం, పుష్కరాల సమయంలో చంద్రబాబుపై డాక్యుమెంటరీ తీసే ప్రయత్నం చేయడం, ముఫ్ఫై మంది భుక్తులు మరణించడం లాంటి విషయాల్లో బోయపాటికి ఆయా వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిన విషయమే. ఆ పరిచయాలతోనే బోయపాటికి చరణ్ సినిమా అయిన వెంటనే భారీ ఆఫర్‌తో సినిమా ఇచ్చేలా చేసి చరణ్ సినిమాతో పాటు చరణ్ పెర్ఫార్మెన్స్ కూడా బ్యాడ్‌గా ఉండేలా ఏమైనా కుట్ర జరిగిందా అన్న అనుమానాలు ఇప్పుడు కొణిదెల ప్రొడక్షన్ ఆఫీసులో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చరణ్ సినిమా పోయినప్పటికీ మరోవైపు ఎన్టీఆర్ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ ప్రయత్నాలేవీ కూడా ఫలించే పరిస్థితి లేదన్న వ్యాఖ్యానాలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.