Tuesday, April 30, 2024
- Advertisement -

సిల్క్ స్మిత గురించి ఎవరికి తెలియని నిజాలు..!

- Advertisement -

ఏలూరులోని కొవ్వలి అనే ఓ చిన్న పల్లెటూరులో జన్మించిన ఓ అమ్మాయిని తన తల్లిదండ్రులు చదివించలేక నాలుగో తరగతిలోనే స్కూల్ మాన్పించారు. అంతేకాకుండా చిన్న వయసులోనే వివాహం చేసి పంపించారు. అయితే అక్కడ భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేకపోయింది. అందుకే ఆ అమ్మాయి కొత్త జీవితాన్ని వెతుకుంటూ చెన్నై రైల్ ఎక్కింది. కాలం కలిసి వచ్చింది. కొన్నాళ్లకే వెండితెరను ఏలే శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె విజయలక్ష్మీ వడ్లపాటి అందరికీ తెలిసిన సిల్క్ స్మిత. సిల్క్ స్మీత జీవితం చూస్తే ఎవరైన షాక్ కావాల్సిందే. 450 పైగా సినిమాలలో నటించిన సిల్క్ జీవితం ముగిసిన తీరు బాధాకరం. 35 ఏళ్లకే చనిపోయిన సిల్క్ స్మిత తను శృంగార తారగా ఎలా మారారో ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. “వాస్తవానికి మంచి ఆర్టిస్ట్ కావాలన్నది నా కోరిక. తమిళంలో వందిచక్రం అనే సినిమాలో నేను సిల్క్ స్మిత అనే బార్ డాన్సర్ గా గ్లామర్ పాత్ర చేశాను. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది.

దాంతో అప్పటి నుంచి దర్శక నిర్మాతలు నాకు అలాంటి పాత్రలే ఇచ్చారు. ఇష్టం లేకున్న వరుసగా అలాంటి పాత్రలే చేశాను. అలా సిల్క్ స్మిత అంటే గ్లామర్ హీరోయిన్ అని ముద్రపడిపోయింది” అన్నారు సిల్క్ స్మిత. హీరోలలో కమల్ హాసన్, చిరంజీవి పక్కన చేయడం బాగా ఉంటుంది, వారు మంచి డాన్సర్స్ అన్నారు సిల్క్ స్మిత. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత చెన్నైలోని తన అపార్ట్మెంట్ లో చనిపోయారు. ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి.

ప్రభాస్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?

ఈ స్టార్ హీరోలకంటే వారి భార్యలకే ఎక్కువ ఆస్తి ఉందట..!

నువ్వే కావాలి హీరోయిన్ గుర్తుందా ?

పూరి ప్రేమ కథ గురించి ఎవరికి తెలియని నిజాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -