Wednesday, May 1, 2024
- Advertisement -

సచిన్‌ సలహా వల్లే ఉత్తమ టెస్టు క్రికెటర్ అయ్యాను : కోహ్లీ

- Advertisement -

2014 ఇంగ్లండ్‌ పర్యటనలో ఘోర వైఫల్యం ఆనంతరం తాను ఉత్తమ టెస్టు క్రికెటర్ గా మరడానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కోచ్ రవి శాస్త్రి ఇచ్చిన సూచనలే కారణమని కెఫ్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. బీసీసీఐ టీవీ కోసం మయాంక్‌ అగర్వాల్‌తో ఓ కార్యక్రమంలో మాట్లాడిన విరాట్ ఆ మార్పు వెనక కారణాలను వివరించాడు.

’2014 ఇంగ్లండ్‌ పర్యటన నా కెరీర్ లో స్పెషల్. ఆ సీరిస్ తర్వాత నా బ్యాటింగ్ గురించి సచిన్ తో మాట్లాడా. బ్యాటింగ్‌ సమయంలో నా తుంటి స్థానంపై దృష్టిసారించాలనుకుంటున్నట్లు తనతో చెప్ఫా. అప్పుడు సచిన్ సలహా ఇచ్చారు. ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌లో ఫార్వర్డ్‌ ప్రెస్‌ (బౌలర్‌ బంతి వేయగానే కుడి చేతివాటం బ్యాట్స్‌మన్‌ తన ఎడమకాలిని ముందుకు తేవడంతో అతని శరీర బరువు మొత్తం ముందుకు రావడం) ప్రాముఖ్యతను నాకు వివరించారు. దాన్ని అనుసరించడంతో ఆస్ట్రేలియా పర్యటనలో మంచి ప్రదర్శన చేయగలిగా. నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాదా.

అప్పడు నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. పేసర్ల బౌలింగ్‌లో క్రీజు బయట నిలబడి బ్యాటింగ్‌ చేయమని అప్పుడు జట్టు డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి సూచించాడు. అలా అయితే మనం ఎంచుకున్న షాట్‌ను ఆడే సౌలభ్యం ఎక్కువగా ఉంటుందని, మనల్ని ఔట్‌ చేసే అవకాశం బౌలర్‌కు ఇవ్వకుండా ఉంటామని చెప్పినట్లు” కోహ్లీ చెప్పాడు.

టీమిండియాలోకి ధోనీ మళ్లీ ఎంట్రీ ఇవ్వాలంటే ఇదొక్కటే మార్గమట..!

కోహ్లీ భయం అంటే ఏంటో తెలియదట : లాయిడ్

ఐపీఎల్ 2020 తర్వాత రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన హర్భజన్..!

రోహిత్‌ ఈజీగా డబుల్ సెంచరీ చేయడానికి కారణం ఇదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -