Thursday, May 9, 2024
- Advertisement -

పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో మావోల లేఖ కలకలం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమవుతున్న వేళ.. విశాఖ మన్యంలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. స్థానిక ఎన్నికలను బహిష్కరించాలంటూ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదలయింది. దోపిడీ పార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీని తరిమి కొట్టాలని లేఖలో పేర్కొన్నారు. బూటకపు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

‘సార్వత్రిక ఎన్నికలకు ముందు బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవో 97 రద్దు చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత బాక్సైట్ సరఫరా చేస్తామని జీవో నెంబర్ 89ను తీసుకొచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో 100% ఉద్యోగాలు జీవో నెంబర్ 3పై ఇప్పటివరకు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయలేదు. రాష్ట్రంలో జగన్ పాలన ఫ్యాక్షనిస్టు నియంత్ర పాలనలా ఉంది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కోసం చివరకు రాజ్యాంగం, నాయస్థానంపై కూడా దిక్కరిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మూడు రాజధానులు నాటకాలు ఆడుతుంది’ అని మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ లేఖలో మండిపడ్డారు.

మరోవైపు ఏపీలో నాలుగు విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. నేటితో(జనవరి 31) మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. సాయంత్ర 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు సమయం ఉంది. ఆఖరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. నెల 29న సర్పంచ్‌ల కోసం 1315 మంది నామినేషన్లు, వార్డు సభ్యుల కోసం 2200 మంది నామినేషన్లు వేశారు. ఈనెల 30న సర్పంచ్‌ల కోసం 8773 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు సభ్యుల కోసం 25519 నామినేషన్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,339 పంచాయతీల్లో మొదటి దశలో ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసినా.. వివిధ కారణాలతో 90 పంచాయతీల్లో ఎన్నికలు జరగడం లేదు. ఫిబ్రవరి 9న తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.

వివ‌ర‌ణ ఇవ్వండి బాబు!

విజయనగరంలో టీడీపీకి భారీ షాక్!

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!

ఒక్క సినిమాతో కనిపించకుండాపోయిన హీరోయిన్స్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -