Monday, May 6, 2024
- Advertisement -

నేడు సంపూర్ణ సూర్య గ్రహణం.. భారత్‌పై ప్రభావం ఉంటుందా?

- Advertisement -

నేడు ఆకాశంలో అద్భుతం జరుగబోతుంది. ఈ ఏడాది తొలిసారి సూర్యగ్రహణం కనువిందు చేయబోతుంది. సూర్యుడు భూమికి మధ్యన చంద్రుడు రావడంతో సూర్య కిరణాలు చంద్రుడిపై పడతాయి. అప్పుడు చంద్రుడి నీడ భూమి పడడం వలన సూర్య గ్రహణ ఏర్పుడుతుంది. 2021లో ఇప్పటి వరకు సూర్య గ్రహణం. ఇదే తొలిసారి కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. శ్రీ ప్లవ నామ సంవత్సర వైశాఖ ఆమావాస్య తేదీ 10 జూన్ 2021 గురువారం రోజు ఏర్పడే కంకణ సూర్యగ్రహణం మనకు వర్తించదు.

అయితే, గ్రహణ ప్రభావం భారత్‌పై ఉండే అవకాశం స్వల్పమే. నాసా ప్రకారం.. భారత్‌లో ఒక్క లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో మాత్రమే ఇది కనిపించే అవకాశం ఉంది. గ్రహణం సమయంలో భూమికి చంద్రుడు మరీ దగ్గరగా ఉండడు. అందువల్ల మొత్తం సూర్య కాంతిని చంద్రుడు పూర్తిగా అడ్డుకోలేడు. ఫలితంగా భూమి నుంచి చూస్తే.. చంద్రుడి చుట్టూ పరావర్తనం చెందే సూర్య కాంతి వలయాకారంలో కనిపిస్తుంది. అందువల్ల దీన్ని రింగ్ ఆఫ్‌ ఫైర్‌గా పిలుస్తారు. గ్రహణం గ్రీన్‌లాండ్, కెనడా, ఉత్తర అమెరికా, ఆర్కిటిక్, అంటార్కిటికా, యూరప్, రష్యా, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో కనబడుతుంది.

ఆయా దేశాల్లో మధ్యాహ్నం 1.42 గంటలకు మొదలై సాయంత్రం 6.41 గంటలకు ముగియనుంది. ఇది కాలిఫోర్నియా, టెక్సాస్, సిడ్ని, దుబాయ్, సింగపూర్ లలో కనపడదు. ఇక, ఈ ఏడాది కనిపించనున్న మిగతా రెండు గ్రహణాల్లో ఒకటి నవంబరు 19న ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే.. గ్రహణ ప్రభావం భారత్‌పై ఉండనందున.. మన దేశంలో ఉండేవారు ఎలాంటి నిబంధనలు పాటించాల్సిందిన అవసరం లేదని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఐతే విదేశాల్లో ఉండే భారతీయులు మాత్రం వారి పరిస్థితులు బట్టి జపం, స్నానం, హోమం వంటివి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ముంబైలో కుప్పకూలిన 4 అంతస్థుల భవనం.. 9 మంది మృతి

టాలీవుడ్ విషాదం : ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూత

నేటి పంచాంగం,గురువారం(10-06-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -