Tuesday, April 30, 2024
- Advertisement -

త్వరలో పీహెచ్​సీలలో స్పుత్నిక్​ వీ పంపిణీ

- Advertisement -

మనదేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియను ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే కోవాక్జిన్​, కోవిషీల్డ్​ వ్యాక్సిన్​ను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రష్యా తయారుచేసిన స్పుత్నిక్​ ​- వీ వ్యాక్సిన్​కు ఇప్పటికే మనదేశంలో అనుమతులు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఈ వ్యాక్సిన్​ కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ క్రమంలో స్పుత్నిక్​ వీ వ్యాక్సిన్​ను త్వరలో ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్​సీ కేంద్రాల్లో కూడా పంపిణీ చేయనున్నట్టు సమాచారం.

స్పుత్నిక్​ వీ వ్యాక్సిన్​ టీకా ఒక్కో డోసు ధర రూ.1,145గా నిర్ణయించారు. మనదేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్​ చేయాలని కేంద్రం భావిస్తున్నది. గతంలో వ్యాక్సినేషన్​ విషయంలో నిర్లక్ష్యం వహించడంతోనే సెకండ్​ వేవ్​ ముప్పు ముంచుకొచ్చిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం థర్డ్​వేవ్​పై భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ పై ఆందోళన ఉంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్​ వేగంగా చేస్తేనే కరోనాను కట్టడి చేయగలమంటూ డబ్ల్యూహెచ్​వో సైతం సూచించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నది.

Also Read: కరోనాతో మెదడు కణజాలంపై ప్రభావం..!

స్పుత్నిక్‌-వీతో పాటు మోడర్నా, జైడస్‌ క్యాడిలాతో వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. మనదేశంలో ప్రస్తుతం కోవాక్జిన్​, కోవిషీల్డ్​ తయారవుతున్నాయి. అయితే మనదేశ జనాభాకు సరిపడా వీటి ఉత్పత్తి లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్​ వీ వ్యాక్సిన్​ను రష్యా తయారుచేయగా.. దేశీయంగా రెడ్డి ల్యాబ్స్​ ఈ వ్యాక్సిన్​ను ఉత్పత్తి చేస్తున్నది.

స్పుత్నిక్​ వీ వ్యాక్సిన్​ కూడా అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్​ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని కోవిడ్‌-19 వర్కింగ్‌ గ్రూప్‌ ప్రెసెడింట్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 మిలియన్ల వ్యాక్సినేషన్​ పంపిణీ చేసే సామర్థ్యం ఉంది. దీన్ని 10 మిలియన్లకు పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే స్పుత్నిక్​ వీ వ్యాక్సిన్​ను ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్ సీలలో సైతం పంపిణీ చేయనున్నారు.

Also Read: కరోనా వ్యాక్సిన్​తో వ్యంధ్యత్వం.. నిజమెంత?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -