Wednesday, May 1, 2024
- Advertisement -

భారత్ అంటే రష్యాకు ఎంత ప్రేమో !

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటిలో కెల్లా భారత్, రష్యా దోస్తీ సంథింగ్ స్పెషల్ గా నిలుస్తోంది. ఈ రెండు దేశాల మద్య స్నేహం ఇప్పటిది కానప్పటికి, అమెరికా వంటి దేశాలకు ఇండియా-రష్యా మద్య స్నేహం ఏ మాత్రం మింగుడు పడడంలేదు. ఈ విషయాన్ని పలు సందర్భాలలో స్వయంగా అమెరికనే చెప్పుకొచ్చిన సంగతి మనం చూశాం. ఇదిలా ఉంచితే ప్రస్తుతం రష్యా పరిస్థితి ఏమాత్రం బాగోలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఉక్రెయిన్ తో యుద్దం కారణంగా అనేక ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ కొనుగోలుపై పలు దేశాలు నిషేదాన్ని విధిస్తున్నాయి. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థకు దారుణంగా పడిపోతోంది.

అంతే కాకుండా ఉక్రెయిన్ తో యుద్దం కారణంగా అనేక మల్టీ నేషనల్ కంపెనీలు కూడా రష్యా నుండి పూర్తిగా వైదొలుగుతున్నాయి. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణంగా పడిపోతోంది. అయితే ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా రష్యా భారత్ పై అభిమానం చూపిస్తుండడం గమనార్హం. ఎందుకంటే చమురు ఎగుమతుల విషయంలో పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇండియా కు అతి తక్కువ రేట్లకే ఎగుమతి చేస్తోంది. మన దేశంలో క్రూడ్ ఆయిల్ వినియోగం అధికంగానే ఉంది. అందువల్ల భారత్ కు చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాక్ మొదటి స్థానంలో రష్యా రెండవ ప్లేస్ లో ఉంది.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ కు అతి తక్కువ ధరకే రష్యా ఎగుమతి చేస్తుండడంతో భారత రిఫైనర్లు రష్యా నుండి చమురు దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రష్యా కేవలం ఎగుమతులు దిగుమతుల విషయంలోనే కాకుండా చాలా సందర్భాలలో ఇండియా పై ప్రత్యేక అభిమానాన్ని కనబరుస్తూనే ఉంది. ముఖ్యంగా ద్వైపాక్షిక శికరాగ్ర ఒప్పందాలలో కూడా ఇరు దేశాల మద్య స్నేహం స్పష్టంగా కనిపిస్తోంది.మరి ఈ రెండు దేశాల మద్య స్నేహం ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి .

Also Read

1.ఉక్రెయిన్ అమెరికా ను నమ్మడం లేదా ?

2.అయ్యో పాపం .. ఉక్రెయిన్ ..!

3.కృత్రిమ మానవులు వచ్చేస్తున్నారోచ్ ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -