Wednesday, May 8, 2024
- Advertisement -

వాలెంటిర్లను వాడుకుంటా ?

- Advertisement -

2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని కనీవినీ ఎరుగని రీతిలో అఖండ విజయం అధికారం చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో జగన్ అంతా భారీ విజయాన్ని నమోదు చేయడానికి ప్రధాన కారణం.. ఆ ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించిన ఎన్నో హామీలు ప్రజల్లోకి గట్టిగా వెళ్లడంతో ఏ పార్టీకి దక్కని విజయం వైసీపీ కి దక్కింది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలెంటీర్ ను నియమించి, ఆ వాలెంటీర్ ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే ప్రక్రియ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లో ఈ వాలెంటీర్ విధానంపై జరిగిన చర్చ అంతా ఇంత కాదు.

ప్రస్తుతం ఈ వాలెంటీర్ వ్యవస్థలో లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో, లోపాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా వాలెంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ డబ్బు అధిక మొత్తంలో వృధా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాకుండా వాలెంటిర్లను ప్రజలు వైసీపీ పార్టీ తొత్తులుగానే చూస్తున్నారు తప్పా ప్రభుత్వ అధికారులుగా భావించడంలేదు. ఇకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం వాలెంటిర్లను జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం గట్టిగానే వాడుకునేటట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను వాలెంటిర్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి..

ఇలా వాలెంటిర్ల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి, ఎన్నికలకు ముందు పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగి మళ్ళీ విజయ ధూందూది మోగించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట. నిజంగా ప్రభుత్వం తరుపున ప్రజలకోసం ఏర్పరచిన వాలెంటిర్లను కేవలం “వైసీపీ పార్టీ కోసమే వాలెంటిర్లు ” అనే భావన ఇప్పటికే ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వాలెంటిర్లు వైఎస్ జగన్ కు లాభామా ? లేక నష్టమా ? అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడక తప్పదు.

Also Read

1.అలా చేస్తే కే‌సి‌ఆర్ కు బిగ్ షాక్ తప్పదా ?

2.చంద్రబాబు ఇలా చేసి చూడు

3.ఇక చంద్రబాబు పనైపోయిందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -