Wednesday, May 8, 2024
- Advertisement -

5 ఎంపీ,9 అసెంబ్లీ..బీజేపీ లిస్ట్ ఇదే!

- Advertisement -

ఎన్డీయే కూటమిలో టీడీపీ చేరికకు ముహుర్తం ఖరారైంది. రేపు ఎన్డీయే కూటమిలో టీడీపీ చేరికనుందని ప్రచారం జరుగుతుండగా ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్డీయేలో బీజేపీ చేరిక ప్రకటన వెంటనే హస్తినకు పయనం కానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మార్చి 4న సీట్ల ప్రకటనకు సంబంధించిన ప్రకటన రానుండగా టీడీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీకి ఇచ్చే స్థానాలపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ స్థానాలు, 9 అసెంబ్లీ సీట్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

అరకు,తిరుపతి,హిందూపురం,కర్నూలు,రాజమండ్రి లేదా ఏలూరు ఎంపీ స్థానాలు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే శ్రీకాకుళం, విశాఖ ఉత్తరం, మాడుగుల, నర్సాపురం,ధర్మవరం , జమ్మలమడుగు , మదనపల్లి , తిరుపతి , పాడేరు , కైకలూరు , నర్సరావుపేటతో పాటు మరికొన్ని స్థానాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా బీజేపీ ఫస్ట్ లిస్ట్ వస్తే టీడీపీలో అసంతృప్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -