Tuesday, April 30, 2024
- Advertisement -

నాడా పరిధిలోకి బీసీసీఐ….

- Advertisement -

భారత క్రికెటర్లు కూడా డోపింగ్ టెస్ట్ నాడా పరిధిలోకి రానున్నారు. నాడా ఎప్పుడు అడిగినా క్రికెటర్లు తమ నమూనాల్సి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజునుంచే నాడా పరిధిలోకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వచ్చినట్లు స్పోర్ట్స్ సెక్రటరీ రాధేష్యం జులానియా ప్రకటించారు.

ఇటీవలె నిషేధిత ఉత్ప్రేరకం వాడి.. డోపింగ్ టెస్టులో దొరికిపోయిన యువ ఓపెనర్ పృథ్వీ షా‌పై 8 నెలల పాటు బీసీసీఐ నిషేధం విధించింది. ఎప్పుడో బీసీసీఐ నాడా పరిధిలోకి రావాల్సింది కాని డోపింగ్ టెస్టు ప్రమాణాలు, నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేసిన భారత క్రికెట్ బోర్డు తిరస్కరిస్తూ వస్తోంది. ఐసీసీ ద్వారా బీసీసీఐపై ఒత్తిడి పెంచిన ఫలితం లేకపోయింది.

మరో సారి ఐసీసీ, నాడా ఒత్తిడి చేయడంతో మ్యాచ్ లు ఆడే సమయంలో మాత్రమే క్రికెటర్లు నమూనాలు ఇస్తారని మెలిక పెట్టింది. తాజాగా టెస్టు ప్రమాణాలు, నాణ్యతని పెంచామని బీసీసీఐని ఎట్టకేలకి ఒప్పించగలిగిన నాడా విజయవంతంగా బీసీసీఐని తమ పరిధిలోకి తీసుకోగలిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -