Wednesday, May 8, 2024
- Advertisement -

ఓట్లు చీలకుండా కౌషల్ ఆర్మీ జాగ్రత్తలు

- Advertisement -

గత రెండు వారాలుగా కౌషల్ ను టార్గెట్ చేసి కౌషల్ ఆర్మీకి టార్గెట్ గా మారిపోయిన బాబు గోగినేని. దీప్తి నల్లమోతు ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. వీరితో పాటు నందిని రాయ్, గణేశ్, కౌషల్ కూడా నామినేట్ అయ్యారు. బాబు గోగినేని, దీప్తి నల్లమోతు, నందినిరాయ్, గణేశ్…ఎప్పుడు నామినేట్ అవుతారా ? ఎలిమినేట్ చేసేసి, వారికి కౌషల్ ఆర్మీ పంచ్ పవర్ ఏంటో చూపిద్దామని ఎదురు చూశారు కౌషల్ అభిమానులు. వారు ఎదురుచూసిన అవకాశం రానే వచ్చింది. కానీ ఆ నలుగురితో పాటు కౌషల్ కూడా నామినేట్ అవడంతో ఇప్పుడు వారి వ్యూహం మారిపోయింది. ఇది వరకూ ఎవరైతే కౌషల్ ను ఎక్కువ ఇబ్బంది పెట్టి, అవమానించి, వేధించారో వారిని కౌషల్ ఆర్మీ హిట్ లిస్టులో పెట్టేది.

ఎవరు పెద్ద ముదురో..ఎవరితో కౌషల్ కు ఎక్కువ టెన్షన్, ఇబ్బంది వస్తున్నాయో…వారిని ఫస్ట్ పంపించేలా ఓటింగ్ లో పాల్గొనేది. ఉదాహరణకు ఓ వారం తేజశ్వి, తనీశ్, సామ్రాట్, రోల్ రైడా, దీప్తి నల్లమోతు, నామినేట్ అయ్యారు. ఆ వారం కౌషల్ ఆర్మీ ప్రధానంగా తేజశ్విని టార్గెట్ చేసింది. ఆమెను బయటకు పంపాలని సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేసింది. దీప్తి నల్లమోతు, రోల్ రైడా గోడమీద పిల్లులే అయినా, హౌస్ లో సేఫ్ గేమ్ ఆడుతూ, కౌషల్ ను టార్గెట్ చేసే వారికి భజన చేస్తూ బతికేస్తున్నా…ఆ వారం తేజశ్విని ఎలిమినేట్ చేయాలంటే వీరిని రక్షించాలని భావించింది. అందుకే వారిద్దరికీ ఏమాత్రం సీన్ లేకపోయినా, తేజశ్వి, తనీష్, సామ్రాట్ మీద కోపంతో రోల్ రైడా, దీప్తి నల్లమోతుకు భారీగా ఓట్లు వేసి రక్షించింది. కౌషల్ ఆర్మీ దెబ్బకు తేజశ్వి ఎలిమినేట్ అయిపోయింది.

ఇక అప్పటి నుంచి దీప్తి నల్లమోతు తానో పెద్ద తోపు అనుకుంటోంది. వాస్తవాలు, కౌషల్ ఆర్మీ యుద్ధం గురించి, ఓటింగ్ వ్యూహం గురించి తెలియక తాను తిరుగులేని కంటెస్టెంట్ అనే భ్రమలో బతికేస్తోంది. దీంతో సందు దొరికితే చాలు కౌషల్ ను టార్గెట్ చేస్తోంది. మరోవైపు ఇంటర్నేషనల్ ఫిగర్, తెలుగు మాట్లాడితే చిన్నతనంగా భావిస్తారేమో…అని భావించే బాబు గోగినేని కూడా కౌషల్ పై కక్ష కట్టేశాడు. అయోమయం సర్వీస్, ఇక్కడవి అక్కడ అక్కడవి ఇక్కడ మోసేసి, అడిగేసరికి సారీ చెప్పేసే నందిని కూడా, అవసరం తీరాక, కాస్తా కాన్ఫిడెన్స్ వచ్చాక కౌషల్ మీద పడి ఏడవడం మొదలెట్టింది. ఇక గణేశ్ ఉన్నాడంటే గోగినేని అసిస్టెంట్ గా మారిపోయాడు. బుర్ర ఏమాత్రం వాడకుండా..అసలు ఉంటే కదా వాడటానికి అని అనేవారూ లేకపోలేదు.

గోగినేని ఏది చెబితే అది చేస్తూ ఆయనకు పర్సనల్ అసిస్టెంట్ అయిపోయాడు. ఆయన ఇన్ ఫ్లుయెన్స్ తో వరుసగా ఆరుసార్లు కౌషల్ ను నామినేట్ చేశాడు. దీంతో గణేశ్ ఎలిమినేషన్ కోసం కౌషల్ ఆర్మీ గన్స్ ఎక్కుపెట్టి సిద్ధంగా ఉంది. అయితే గోగినేని, దీప్తి నల్లమోతు, నందిని, గణేశ్…ఈ నలుగురి కోసం వేచి చూసిన కౌషల్ ఆర్మీ ఇప్పుడు తమ వ్యూహం, ఓటింగ్ అంతా కౌషల్ ను సేఫ్ జోన్లో తెచ్చేయడానికే ఉపయోగిస్తోంది. తమ ఓట్లు చీలిపోకుండా అన్ని ఓట్లు ఆయనకే వేస్తోంది. ఈ నలుగురూ కౌషల్ కు శతృవులే కనుక ఆ నలుగురిలో ఎవరు పోయినా తమకు సంతోషమే. కనుక వాళ్ల చావేదో వాళ్లు చస్తారు. అని వారిని పట్టించుకోకుండా కౌషల్ కు బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక ఓట్లు పడేలా వాళ్లు కష్టపడుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -