‘ఆర్ఆర్ఆర్’ నుంచి మార్చి 15న అలియా ఫస్ట్ లుక్ రిలీజ్

- Advertisement -

ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో బ‌హుబ‌లి, బ‌హుబ‌లి-2 వంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల త‌ర్వాత అత్యంత భారీ బ‌డ్జెట్ తో రాబోతున్న చిత్రం “ఆర్ ఆర్ ఆర్”. ఇందులో క‌థానాయ‌కులుగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చర‌ణ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వీరిద్ద‌రికి సంబంధించిన ప‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. దీనికి సినీ ప్రేమికుల నుంచి భారీ స్పంద‌నే వ‌చ్చింది.

ఆర్ ఆర్ ఆర్ లో మ‌న్యందొర అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న రామ్‌చ‌ర‌ణ్ కు జోడిగా బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భ‌ట్ న‌టిస్తోంది. ఇక తాజాగా సినిమాకు సంబంధించి మ‌రో క్రేజీ అప్‌డేట్ వ‌చ్చింది. రామ్ చ‌ర‌న్ స‌ర‌స‌న సీత పాత్రలో న‌టిస్తున్న అలియాభ‌ట్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చే య‌నున్న‌ట్టు చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది.

- Advertisement -

ఈ నెల 15న (మార్చి 15) ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి అలియా భ‌ట్ (సీత‌) ఫ‌స్ట్ లుక్‌ను ఈ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ తాజాగా వెల్ల‌డించింది. మార్చి 15న అలియా భట్ పుట్టినరోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స‌మాచారం. “దివ్యతేజస్సుతో అలరారే మా సీత వస్తోంది… చూడండి” అంటూ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ ట్వీట్ చేసింది. మార్చి 15న ఉదయం 11 గంటలకు అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని పేర్కొంది.

బుల్లితెరపై దేవిశ్రీ ప్రసాద్ అదుర్స్ !

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో కృతిశెట్టి రోమాన్స్ !

అరటి తొక్కతో ఇన్ని ప్రయోజనాలున్నాయా !

మెరిసే ముఖ సౌంద‌ర్యం కోసం.. ఈ చిట్కాలు !

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో హృతిక్ రోష‌న్ ఫైట్ !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -