Thursday, May 9, 2024
- Advertisement -

అ! సినిమా అద‌రింద‌బ్బా

- Advertisement -

`అ` రివ్యూ

తెలుగు సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా మారారు హీరో నాని వరుస విజ‌యాలతో దూసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు నిర్మాతగా మారి అ! అనే సినిమాను రూపొందించారు. షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించిన ప్రశాంత్ వర్మను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. ఎంతో మందితో తీసిన ఈ సినిమాపై ప్రేక్ష‌కులు భారీ అంచ‌నాలు పెట్టుకోవ‌డంతో ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 16వ తేదీన విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

చిత్మ నిర్మాత, హీరో నాని విన‌తి మేర‌కు మేం కూడా ఈ సినిమా క‌థ‌ను చెప్పాల‌ని అనుకోవ‌డం లేదు. అయితే ఈ సినిమా ఓవ‌రాల్‌గా ఎలా ఉందో చెబుతున్నాం. కాజల్, నిత్యామీనన్, రెజీనా, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, ముర‌ళీశ‌ర్మ‌, రోహిణి తదితరులు ఒక్కో పాత్ర‌లో మెరుస్తారు. కొంద‌రి జీవితాల్లో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాను తెర‌కెక్కించారు.

తెలుగు సినిమా పరిశ్రమకు ఓ కొత్తదనం అందించే సినిమా అ!. ఓ విభిన్నమైన విజిల్స్ వేసే కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమా ఇది.. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు ఇప్పటివరకు తెలుగు సినిమాలో చూసి ఉండరని బలంగా చెప్పుకోవచ్చు.

నిర్ఘాంతపోయే కథతో ప్రశాంత్‌ వర్మ తీసిన సినిమా ద‌ర్శ‌కుడిగా క్లిక‌య్యాడు. కాజల్ అగర్వాల్, నిత్య మీనన్, రెజీనా పాత్ర‌ల్లో మునిగారు. నాని చేపకు, రవితేజ చెట్టుకు వాయిస్ ఓవర్ వారు ఒక‌రిపై ఒక‌రు పంచ్‌లు వేసుకోవ‌డం న‌వ్వులు పుట్టిస్తుంది. విజువల్ ఎఫెక్ట్, డిఫరెంట్ పాత్ర‌ల‌తో ఈ సినిమా పూర్తిగా ప్రయోగాత్మక సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కథ అంతా కాజల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, మురళీశర్మల చుట్టూనే ఓ హోటల్‌లో తిరుగుతుంది.

టాలీవుడ్‌లో ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు లేవు… అ! సినిమా గొప్ప సినిమా అని ఖచ్చితంగా ప్రతీ ఒక్కరు కూడా ప్రశంసించే సినిమానే అని చెప్పుకోచ్చు. కొన్ని సామాజిక అంశాలను కూడా ద‌ర్శ‌కుడు తెర‌పైకి తీసుకొచ్చాడు. సంగీతం సినిమాకు మేజ‌ర్ ప్ల‌స‌య్యింది.
కాజల్ అగర్వాల్, నిత్య మీనన్, రెజీనా కసండ్రా తదితరులు గ్లామర్ లెక్కలు చూడకుండా ఇలాంటి ప్రయోగాత్మక సినిమా చేసినంది హాట్స్ అప్.

న‌టీన‌టులు: కాజల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, మురళీశర్మ
ద‌ర్శ‌క‌త్వం- క‌థ‌: ప‌్ర‌శాంత్ వ‌ర్మ‌
నిర్మాత: నాని (వాల్ పోస్ట‌ర్ సినిమా)
సంగీతం: మార్క్ కె.రూబిన్‌

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -