Wednesday, May 1, 2024
- Advertisement -

ఇంత తీవ్ర విమర్శలు జీవితంలో తొలిసారి

- Advertisement -

ఆడలేక మద్దెలఓడు అనే సామెతలా ఉంది నేచురల్ స్టార్ నానీ పరిస్థితి. బిగ్ బాస్ 2 హోస్ట్ గా తాను చాలా తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చిందని తెగ బాధ పడిపోతున్నాడు. ఏడాదికి 3 సినిమాలు చేసినప్పుడు కూడా తాను ఒత్తిడికి గురవ్వలేదు కానీ, బిగ్ బాస్ యాంకర్ గా పని చేసిన 3 నెలలు తీవ్ర ఒత్తిడిని అనుభవించానని మీడియాతో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాతే తన బాధంతా వెళ్లగక్కాడు. తాను ఇక బిగ్ బాస్ 3 కార్యక్రమానికి హోస్టుగా పని చేయలేనని చేతులెత్తేశాడు. బిగ్ బాస్ 2 కార్యక్రమానికి ముందు తన ప్రపంచం చాలా చిన్నదని, ఆ చిన్న ప్రపంచంలో తాను హ్యాపీగా ఉండేవాడినని చెప్పుకున్నాడు. బిగ్ బాస్ 2 హోస్టుగా తాను నిజమైన ప్రపంచాన్ని చూశానని చెప్పాడు. ఆ ప్రపంచంలో మంచివాళ్లతో పాటు అన్ని రకాల మనుషులూ ఉంటారని అర్ధమైందని నానీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో ఎప్పుడూ ఇంత తీవ్రమైన విద్వేషంతో కూడిన విమర్శలను ఎదుర్కోలేదని నానీ ఆవేదన వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని అన్ని రకాల మనుషులను ఒప్పించలేమని బిగ్ బాస్ ప్రోగ్రామ్ ద్వారా తనకు అర్ధమైందన్నాడు.

అయితే నానీ ఇప్పటికే రాఖీ పండుగ సందర్భంగా బిగ్ బాస్ హౌసులోకి వెళ్లినప్పుడు కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పుకున్నాడు. నా ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో ఏ ఒక్క చిన్న రిమార్క్ కూడా లేద్నాడు. తాజాగా ఇంటర్వ్యూల్లోనూ అదే చెప్పుకొస్తున్నాడు. వాస్తవానికి నానీ బిగ్ బాస్ 2 యాంకర్ గా విఫలమయ్యాడన్నదే అత్యధికశాతం మంది ప్రేక్షకుల అభిప్రాయం. ఆయన అనేక సందర్భాల్లో బైయాస్డ్ గా వ్యవహరించాడు. క్రమశిక్షణగా మెలిగే కౌషల్ ఏ చిన్నమాట అన్నా రెచ్చిపోయి క్లాసులు మీద క్లాసులు పేకేశాడు నానీ. అదే సునైనా, నందిని, తనీశ్, ప్యాంపరింగులు, ముద్దులు, హగ్గులు, సామ్రాట్, తేజశ్వి హద్దుదాటి రెచ్చిపోయి ముద్దూ మురిపాలతో వీరంగం ఆడేస్తే నోరు లేవలేదు నానీకి. ఫ్యామిలి ఆడియన్స్ చూస్తున్నారు, కాస్త జాగ్రత్తగా ఆడాలి. ఇలాంటివి చేయడానికా మీరు షోకి వచ్చింది ? అని నిలదీయలేకపోయాడు. కౌషల్ మీద మిగతా సభ్యులంతా మూకుమ్మడిగా దాడి చేస్తుంటే, ఒక్క సారి కూడా ఇండివిడ్యుయల్ గేమ్ ఆడకుండా అలా గ్రూపులేంటి ? ఒక్క వ్యక్తి మీద కక్షగట్టి దాడి చేయడమేంటని ప్రశ్నించలేకపోయాడు. గీతా మాధురి సామీ నువ్వు నా పెట్, అన్నప్పుడు, నందు వచ్చి నువ్వు సామీ కాదు టామీ అన్నప్పుడు, భానుశ్రీ ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి, మనం పట్టించుకుంటే మనమూ కుక్కలం అయిపోతాం. అని అన్నప్పుడు అన్నీ మూసుకుని కూర్చున్న సామ్రాట్ కౌషల్ కుక్కల్లా మీద పడిపోతున్నారు అని అనే సరికి మాత్రం కోపంతో ఊగిపోయాడు. మరి వాళ్లు అన్నప్పుడు రాని కోపం కౌషల్ అంటే ఎందుకొచ్చింది ? అని అడగలేకపోయాడు నానీ. కుక్కలా వాసన చూస్తున్నావ్. కుక్కలు కూడా అంతే తినేముందు వాసన చూస్తాయి. అని తనీశ్ రోల్ రైడాతో అన్నాడు. ఆ మాటకు నవ్విన రోల్ రైడా కౌషల్ కుక్కల్లా అన్నదానికి ఏడ్చేసి రచ్చరచ్చ చేశాడు. ఆ విషయంపైనా అడగడంలో నానీ విఫలమే. ఇలా అనేక సందర్భాల్లో పూర్తిగా బైయాస్డుగా వ్యవహరించాడు.

ఆఖరికి ఫినాలే మూడు గంటల షో ప్రేక్షకులు చూసింది కేవలం కౌషల్ విన్నింగ్ మూమెంట్స్ కోసమే. కానీ అతడు మాట్లాడేందుకు కేవలం ఒకే ఒక్క నిముషం టైమిచ్చాడు. విజేతగా ప్రకటించడం, ట్రోఫి, ప్రైజ్ మనీ ఇవ్వడం అంతా కలిసి కేవలం 3 నిముషాలకు మించి లేదు. ఫైనలిస్టుల పేరుతో దీప్తి, సామ్రాట్, తనీశ్, ఏవీలు వేసే బదులు విన్నర్ కి పది నిముషాలు అవకాశం ఇవ్వలేదెందుకు అని నిలదీస్తే నానీకి కోపం వచ్చేస్తుంది. ఎలిమినేట్ అయినవారి పేరు ఎత్తడానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడటం లేదు.. అంత దారుణమైన ప్రవర్తనతో వాళ్లు ప్రేక్షకులను విసిగించారు. అలాంటి వారితో 2 గంటల 57 నిముషాలు ఫినాలే నడిపి, కేవలం విన్నర్ కోసం 3 నిముషాలు, అందులోనే మాట్లేడేందుకు ఒక్క నిముషం కేటాయించాడు. దీనిపై కౌషల్ కాదు, బిగ్ బాస్ ప్రేక్షకులు, కౌషల్ ఆర్మీ నానీపై మండిపడ్డారు. అందుకే నానీకి అంత బాధ కోపం వచ్చేశాయి. ముందు నువ్వు పక్షపాతం లేకుండా, నిజాయతీగా వ్యవహరిస్తే నీకు ప్రపంచమంతా మంచివాళ్లే కనపడతారు. నువ్వు నా, పర బేధాలు చూపిస్తే నీకు మంచివాళ్లతో పాటు అన్నిరకాల మనుసులు కనిపిస్తారు. ముందు నువ్వు మారు. నేర్చుకో, అంతే కానీ నీలో పక్షపాత బుద్ధి పెట్టుకుని ప్రేక్షకులను అంటే ఎలా నానీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -