Thursday, May 2, 2024
- Advertisement -

బాలీవుడ్ లో ఎదో జరిగితే విజయ్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?

- Advertisement -

బాలీవుడ్ లో నెపోటిజం మీద ప్రేక్షకులు సోషల్ మీడియా లో పెద్ద యుద్ధమే చేస్తున్నారు.. బాలీవుడ్ పెద్దల వారసులు చేసిన సినిమాలను ససేమీరా వారు చూడడం లేదు. దానికి ఇటీవలే విడుదలైన బాలీవుడ్ వారసుల ట్రైలర్ ల డిస్ లైక్ లే నిదర్శనం.. సుశాంత్ మరణం తో బాలీవుడ్ లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. సుశాంత్ మరణానికి నెపోటిజం ని కారణంగా చూపిస్తూ ప్రేక్షకులు వారసత్వాన్ని అణగదొక్కాలని వారసుల సినిమాలను చూడొద్దని ఉద్యమం చేపట్టారు.. ఆ కోవలోనే వారి సినిమా లను అన్ లైక్ చేయడం మొదలుపెట్టారు. 

అయితే ఈ సెగ టాలీవుడ్ కి కూడా పాకే సూచనలు కనిపిస్తున్నాయి.టాలీవుడ్ లో హీరోలందరూ వారసులే అని చెప్పొచ్చు.. ఒక్కరిద్దరు తప్పా అందరు టాలీవుడ్ పెద్దల వారసులే..రామ్ చరణ్, నాగ చైతన్య, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, అఖిల్, మహేష్ బాబు, నాగార్జున, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది ఇండస్ట్రీ ఎదో ఒక బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్ళే.. అయితే బాలీవుడ్ లో ఉన్న నేపోటిజం ఇక్కడ మొదలైతే మాత్రం చాలా కష్టం అంటున్నారు ప్రేక్షకులు.. 

ఇప్పటికే టాలీవుడ్ లో పనిచేస్తున్న బాలీవుడ్ యాక్టర్ల వారసుల పై ఓ కన్నేశారు ప్రేక్షకులు RRR లో నటిస్తున్న అలియా భట్ ని ఇప్పటికే యా సినిమా నుంచి తొలగించాలనే డిమాండ్ ఉంది.. ఇక తాజాగా అటొచ్చి ఇటొచ్చి విజయ్ దేవరకొండ సినిమా కి తగిలేలా ఉంది.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన విజయ్ అర్జున్ రెడ్డి తో క్రేజ్ సంపాదించుకుని బాలీవుడ్ లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ కోవలోనే పూరి జగన్నాధ్ తో ఓ సినిమా చేస్తునాడు.. ఆ సినిమాలో హీరోయిన్‍ అనన్య పాండే. మరి ఆ సినిమా వచ్చేసరికి ఈ ద్వేషం ముదిరితే దానిని పూరి ఎలా కౌంటర్‍ చేస్తాడో. అసలే ఈ చిత్రానికి కరణ్‍ జోహార్‍ పేరు కూడా తోడయింది. అతనిపై వున్న ద్వేషమయితే తారాస్థాయిలో వుంది కనుక మొత్తం మీద పూరి సినిమా హిందీ వెర్షన్‍కి ఈ హేటర్స్ బెడద తీవ్రంగా వుండేలాగుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -