Monday, April 29, 2024
- Advertisement -

ఎవరు రివ్యూ

- Advertisement -

అడివి శేష్, మరియు రెజినా కలిసి నటించిన చిత్రం ఎవరు. ఈ సినిమా నేడు థియేటర్ల లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా మొదటి నుంచి ఎంతో ఆసక్తి ని క్రియేట్ చేస్తుంది. అలాగే సినిమా కి సంబందించిన థియాట్రికల్ ట్రైలర్ కూడా ఎంతో ఆసక్తి ని రేపింది. ఈ సినిమా ద్వారా ఒక కొత్త డైరెక్టర్ తెలుగు తెర కి పరిచయం అవుతున్నారు. ఈ సినిమా డైరెక్టర్ వెంకట్ రామ్ జీ. ఈ సినిమా సమీక్ష విషయానికి వస్తే..

కథ: డీ సి పీ అశోక్ (నవీన్ చంద్ర) ని సమీరా (రెజీనా) హత్య చేస్తుంది. ఈ కేసు విచారణ నిమిత్తం విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్) అనే పొలిసు ఆఫీసర్ సమీరా ని కలుస్తాడు. సమీర దగ్గర లంచం తీసుకొని సమీర కి హెల్ప్ చేయడానికి వచ్చిన విక్రమ్ సమీరా ని అడిగే ప్రశ్నల తో హత్య కేసు గురించిన చాలా నిజాలు బయటకు వస్తాయి. అవేంటి? విక్రమ్ వాసుదేవ్ మోటివ్ ఏంటి? చివరికి ఏం జరుగుతుంది? అనేది సినిమా కథ.

నటీనటులు పనితీరు: అడవి శేష్ అద్భుతమైన నటన ఈ సినిమాకి వెన్నెముక గా చెప్పుకోవచ్చు. తన పాత్రలో ఒదిగిపోయి ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. తాను కాకపోతే ఇంకెవరు ఆ పాత్రలో ఇంత బాగా నటించలేరేమో అన్నంత బాగా అడవి శేష్ నటనతో సినిమాని సింగిల్ హండ్రెడ్ గా ముందుకు తీసుకు వెళతాడు. రెజీనా కసాండ్రా కి ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో తన పాత్రకి చాలా రకాల వేరియేషన్స్ ఉన్నాయి. అన్నిటినీ చాలా సులభంగా చూపించగలనని ఈ సినిమాతో రెజీనా నిరూపించుకుంది. నవీన్ చంద్ర నటన ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు నవీన్ చంద్ర. మురళి శర్మ నటనకు సినిమాలో మంచి మార్కులే పడ్డాయి.ఈ సినిమాలో నిహాల్ కోదాటి కి కూడా చాలా మంచి పాత్ర దక్కింది. తన పాత్రకి నిహల్ కోదాటి చాలా బాగా న్యాయం చేశాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం పనితనం: దర్శకుడు వెంకట్ రాంజీ ఈ కథను ముందుకు తీసుకు వెళ్లిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది. సినిమాలోని ప్రతి ట్విస్ట్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కోట్టించకుండా దర్శకుడు వెంకట్ రామ్జి ఒక అద్భుతమైన కథతో ముందుకు రావడం మాత్రమే కాక తన నెరేషన్ తో ప్రేక్షకులను చాలా బాగా ఆకర్షించారు. పీవీపీ సినిమా బ్యానర్ అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి. క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఏమాత్రం రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం సినిమాకు వెన్నెముక గా మారింది. తన నేపథ్య సంగీతం సినిమా ని మరింత ఆసక్తికరంగా మార్చింది అనడంలో అతిశయోక్తి లేదు. వంశి పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమాకి వంశీ పచ్చిపులుసు అద్భుతమైన విజువల్స్ అందించారు. గ్యారీ బి హెచ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది.

తీర్పు: బలమైన కథ ఉండటం ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటి హాఫ్ మొత్తం వచ్చే కథాకథనం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది. అయితే రెండవ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు మాత్రం ప్రతీ క్యారెక్టర్ పై అభిప్రాయాన్ని మారుస్తూ ఉంటాయి. సినిమాలోని ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను కథ గురించి గెస్ట్ చేసేలా ఉంటుంది. కానీ చివరగా క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించనటువంటి విధంగా ఉంటుంది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. నటీనటులు, ఆసక్తికరమైన కథ, స్క్రీన్ ప్లే మరియు సంగీతం సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ నెగిటివ్ పాయింట్లు కూడా ఏమీ లేవు. చివరిగా ‘ఎవరు’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక అద్భుతమైన థ్రిల్లర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -