బన్నీ లైనప్ లో మరో డైరెక్టర్..ఎవరంటే..!

- Advertisement -

అలవైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ కావడంతో అల్లు అర్జున్ మాంచి జోష్ మీద ఉన్నాడు. వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బన్నీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దీనిని రెండు పార్టులుగా నిర్మిస్తున్నారు. పుష్ప 1 పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాలో నటించనున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా ముగిసిన తర్వాత మళ్లీ పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

ఈ సినిమాల తర్వాత మురుగదాస్, బోయపాటి శ్రీను ల తో కూడా బన్నీ సినిమాలు చేయాల్సి ఉంది. తాజాగా బన్నీ లైనప్ లో మరో డైరెక్టర్ చేరాడు. జెర్సీ సినిమాతో క్లాసికల్ హిట్ సాధించిన గౌతమ్ తిన్ననూరి తో అల్లు అర్జున్ సినిమా చేయనున్నట్లు సమాచారం. గౌతమ్ ఇప్పటికే బన్నీకి కథ వినిపించగా ఆయనకు నచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. 2022 లో వీరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం హిందీలో జెర్సీ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత నాని తో కూడా ఓ సినిమా కూడా ఉన్నట్లు సమాచారం. బన్నీ, గౌతమ్ కమిట్ మెంట్ లు పూర్తి అయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పలో నటిస్తుండగా సుకుమార్ కు డెంగ్యూ రావడంతో షూటింగ్ కు కొద్దిరోజుల పాటు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయన కోల్పోవడంతో ఇవాల్టి నుంచి ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.

Also Read

ప్రభుత్వాలు అనుమతిచ్చినా.. సినిమాల విడుదలకు అడ్డేమిటి?

మహేశ్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. బర్త్​డేకు త్రిబుల్ ట్రీట్..!

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -