మహేశ్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. బర్త్​డేకు త్రిబుల్ ట్రీట్..!

- Advertisement -

తమ అభిమాన హీరో పుట్టినరోజును పండగలా చేసుకుంటుంటారు ఫ్యాన్స్​. ఇక చిత్ర నిర్మాతలు పుట్టినరోజును తమ సినిమా ప్రమోషన్​కు వాడుకోవడం కూడా మామూలు. ప్రతి స్టార్​ హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయన లెటెస్ట్​ మూవీకి సంబంధించిన పోస్టర్​, లేదా గ్లిమ్స్​ వీడియో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆగస్ట్​ 9న సూపర్​ స్టార్​ మహేశ్​బాబు బర్త్​డే. మహేశ్ ప్రస్తుతం పరశురామ్​ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు.

బ్యాంకులను అడ్డుపెట్టుకొని జరుగుతున్న దోపిడీ ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నటి కీర్తి సురేశ్​ హీరోయిన్​గా చేస్తోంది. ఇదిలా ఉంటే ఆగస్ట్​ 9న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్​ విడుదల చేస్తారని ఫ్యాన్స్​ భావించారు. అయితే పోస్టర్​తో పాటు గ్లిమ్స్​ వీడియో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్​ భావిస్తోందట.

- Advertisement -

ఈ సినిమా తర్వాత మహేశ్​బాబు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా రోజుల కిందటే స్క్రిప్ట్ వర్కు పూర్తి చేశాడు. దీంతో ఈమూవీకి సంబంధించిన అప్ డేట్​ కూడా మహేష్ బర్త్ డే సందర్భంగా వచ్చే చాన్స్​ ఉంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మహేశ్​ మూవీకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే చాన్స్​ ఉంది.

Also Read

సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! బ్రేక్ పడేదేలా..!

చైతూకు నో చెప్పిన బేబమ్మ..! రీజన్​ ఏమిటో?

ఈ భామ జోరు చూస్తే ..పూజా హెగ్డే, రష్మికకు ఎసరు పెట్టేలా ఉందే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -