Tuesday, May 7, 2024
- Advertisement -

లాస్ట్ వీక్ అలా అయిపోయిందేంటబ్బా….

- Advertisement -

అందరూ అనుకున్నదే జరిగింది. ఒక సినిమా విజయవంతం అవుతుందో లేదో ఒకప్పుడు ఆ ఫిలిం మేకర్స్ ,విమర్శకులు మాత్రమే ముందుగా చెప్పేవారు. కాని కాలం మారింది కదా. ప్రతి ఒక్కరు క్రిటిక్స్ అయిపోయారు. అందరూ ఓ ఫిలిం సక్సెస్ అవుతుందా లేదా అనేది ముందుగానే గెస్ చేసేస్తున్నారు. ఆక్సిజన్ ,జవాన్ ,ఇంద్రసేన విషయంలో జరిగింది అదే. ఇంద్రసేనపై మాత్రం కాస్త అటుఇటుగా ఆలోచించినా…ఆక్సిజన్ ,జవాన్ లపై మాత్రం కాదు.

ఎందుకంటే… జనాలకు ఈమధ్య రోజుల్లో ఫలితాలు ముందుగానే తెలిసిపోతున్నాయి. అది ఎలా ఉందంటే … అదేదో సినిమాలో(143 చిత్రం) చెప్పినట్లు..మీరిద్దరు లేచిపోయిన బాపతి కదా అని…ఆలి ఓ జంటతో అంటాడు. నీకు ఎలా తెలుసు అని ఆ జంట ఆలీని అడిగితే… స్మెల్ వస్తుంది అంటాడు.అలా ఉంది మన సినిమాల పరిస్థితి. ఫెయిల్యూర్ తాలుకు లక్షణాలు ట్రైలర్ చూస్తుంటేనే కనిపించేస్తుంది. సినిమాలో కంటెంట్ ఉన్నట్లయితే.. ఒక ఎడిటర్ దాని తాలుకు ఫ్లేవర్ ను ఎంతో కొంత ట్రైలర్ లేదా టీజర్ లో చూపిస్తాడు .ఇక్కడలాంటి వాతావరణం చూపించడానికి మూవీలో మ్యాటర్ ఉంటేనే కదా తెలిసేది. అందుకే జనాలు సినిమా ట్రైలర్ వస్తుంటేనే దాని రిజల్ట్ ను అంచనా వేసేస్తున్నారు.

అర్జున్ రెడ్డి చిత్రం ట్రైలర్ చూసినప్పుడు సినీ ప్రేమికులు ఇలాగే గెస్ చేశారు. ఈ విషయంలో మన ఎన్.ఆర్.ఐ. లు ముందున్నారు. వారికి ఆఫీస్ వర్క్ అయిపోయాక మన సినిమాల గురించి ఏదో ఒకటి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈ డిస్కషన్ ఏ స్థాయికి వెళ్లిందంటే… కాంబినేషన్స్ ,ట్రైలర్ బట్టి.. సినిమా ఇలా ఉండబోతుంది…అవసరమైతే ఇంతపెట్టి ఇక్కడ రైట్స్ తీసుకోవచ్చు అనే స్థాయికి వెళ్లిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -