Thursday, April 25, 2024
- Advertisement -

ఫోటో ఫీచర్ : అందమైన చిరునవ్వు చిందిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

- Advertisement -

ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్,కృష్ణ,శోభన్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిపోయిన నటి జయలలిత. ఆ తర్వాత తమిళ నాట అడుగు పెట్టి అక్కడే పలు హిట్ చిత్రాల్లో నటించిన జయలలిత తర్వాత  తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే పార్టీ అధ్యక్షురాలిగా.. ముఖ్యమంత్రిగా తన సత్తాచాటారు. తమిళ ప్రజలు అమ్మా అని పిలుచుకుంటారు.

జయలలిత 1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తెలుగు,తమిళ,కన్నడ భాషల్లో దాదాపు 140 చిత్రాల్లో నటించారు జయలలిత. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. తర్వాత  జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు. 

జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రము పెద్ద హిట్టయ్యింది. మనుషులు మమతలు తో మంచి విజయం అందుకున్న ఆమె స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది. చనిపోయే వరకు ఆమె అవివాహితురాలిగా ఉన్నారు.

పుష్ప ఔట్ ఒక రేంజిలో వచ్చిందట!

అల్లరి నరేష్ ‘నాంది’ సెన్సార్ రివ్యూ!

ప్రెండ్లీ గవర్నమెంట్ అంటూ.. పీఆర్‌సీ కి కన్నం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -