Monday, April 29, 2024
- Advertisement -

కార్తి ‘దేవ్’ మూవీ రివ్యూ

- Advertisement -

త‌మిళ హీరో కార్తికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.ఊపిరి సినిమాతో తెలుగులో కూడా న‌టించాడు. కార్తి న‌టించిన ప్ర‌తి సినిమా తెలుగులో కూడా విడుద‌ల అవుతోంది. తెలుగులో కార్తికి మంచి మార్కెట్ కూడా ఉంది. కార్తి తాజాగా న‌టించిన చిత్రం దేవ్‌. ర‌కుల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ట్రైల‌ర్‌తోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

కథ: దేవ్(కార్తి) తనకు నచ్చినట్లు జీవిస్తుంటాడు. అతడి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. అతడి ఇద్దరి స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. తన స్నేహితుడి కారణంగా ఫేస్ బుక్ ద్వారా మేఘన(రకుల్ ప్రీత్ సింగ్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. దేవ్ ఆమెని ప్రేమిస్తాడు. కానీ ఇద్దరి మనస్తత్వాలు, ఆలోచనలు వేరు. మేఘన మాత్రం దేవ్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోదు.ఎన్నో కష్టాలు పడ్డ ఆమె తన హార్డ్ వర్క్ తో బిజినెస్ ఉమెన్ గా ఎదుగుతుంది. అటువంటి ఆమెని దేవ్ ప్రేమిస్తాడు. మొదట దేవ్ ని పట్టించుకోని మేఘన మెల్లగా అతడి ప్రేమలో పడుతుంది. కాని ఓ కార‌ణంగా వీరిద్ద‌రు విడిపోతారు. ఆ తరువాత ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: అమ్మాయి, అబ్బాయిల మధ్య సంఘర్షణతో కూడుకున్న ప్రేమకథను చూపించాలా..? లేక అడ్వెంచరస్ కథగా తెరకెక్కించాలా..? అనే విషయంలో క్లారిటీ లేక తనకు నచ్చినట్లుగా సినిమాను తీసుకుంటూ వెళ్లిపోయాడు దర్శకుడు. దీంతో సినిమా చూస్తున్న ఆడియన్స్ కథకు కనెక్ట్ కాలేకపోతారు.దర్శకుడు వారి మధ్య ప్రేమ పుట్టించడం, ఒకట్రెండు అడ్వెంచరస్ సన్నివేశాలతో సినిమాను పూర్తి చేసేశాడు. హీరో, హీరోయిన్లు విడిపోవడానికి కూడా బలమైన కారణం ఉండదు.

న‌టీ,న‌టుల ఫ‌ర్మామెన్స్‌ :హీరో కార్తి దర్శకుడిని నమ్మి ఆయన చెప్పినట్లుగా బరువు తగ్గి తన నటనతో దేవ్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. సరికొత్త లుక్ తో కనిపించాడు. కార్తి త‌న పాత్రకి పూర్తి న్యాయం చేశాడనే చెప్పాలి.రకుల్ సీరియస్ క్యారెక్టర్ లో బాగానే నటించినప్పటికీ తెరపై ఈ జంట కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వంటి సీనియర్ నటులకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పాలి.

సాంకేతిక పరిజ్ఞానం ప‌నితీరు:దర్శకుడు ఇలాంటి కథతో కార్తిని ఎలా ఒప్పించాడో అర్ధం కాని పరిస్థితి. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంది. అందమైన లొకేషన్స్ కనిపిస్తాయి. హారిస్ జయరాజ్ సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది. చాలా వరకు కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది.

బోట‌మ్ లైన్‌:
మ‌రి బాగా సాగ‌దీసిన దేవ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -