దృశ్యం -2 రిలీజ్​ ఎప్పుడంటే?

- Advertisement -

ఇటీవల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు సైతం ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. థియేటర్లలో విడుదల చేస్తే కరోనా కారణంగా జనం వస్తారో రారో అన్న సందేహంతో ఓటీటీ వేదికలో విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. వెంకటేశ్​ నటించిన నారప్ప చిత్రం.. అమెజాన్​ ప్రైమ్​లో విడుదలై హిట్​ తెచ్చుకున్నది. ఈ క్రమంలో వెంకటేష్ నటిస్తున్న మరో చిత్రం దృశ్యం 2 కూడా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

ప్రస్తుతం ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా థియేటర్లు ఓపెన్​ చేసే పరిస్థితి లేదు. దీంతో చాలా మంది పెద్ద నిర్మాతలు సైతం తమ సినిమాలను ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఓటీటీలో విడుదల చేయడం మినహా వేరే మార్గం లేదని ప్రముఖ నిర్మాత సురేశ్​ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మలయాళంలో మంచి సక్సెస్​ సాధించిన దృశ్యం చిత్రాన్ని తెలుగులో రీమేక్​ చేయగా .. ఇక్కడ కూడా విజయం సాధించింది.

మలయాళంలో మోహన్ లాల్ మరోసారి దృశ్యం సీక్వెల్ తీయగా అది కూడా అక్కడ ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో దృశ్యం రీమేక్లో నటించిన వెంకటేష్ దృశ్యం 2 తెలుగులో రీమేక్​ చేశారు. సీక్వెల్ లో కూడా వెంకటేశ్​, మీనా జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్​ పూర్తిచేసుకున్నది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్​ 9 లేదా 10 తేదీల్లో డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Also Read

బన్నీ కోసం వచ్చేస్తున్న సన్నీ..!

త్రిష పెళ్లి ఫిక్స్..​? వరుడు ఎవరంటే..?

ఆసియాకే అందగాడు ప్రభాస్​..!

Also Watch

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -