Wednesday, May 1, 2024
- Advertisement -

బాల‌కృష్ణ కెరీర్‌లోనే అతిపెద్ద ఫ్లాప్‌ దిశ‌గా మ‌హ‌నాయ‌కుడు

- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను ఆయ‌న త‌న‌యుడు హీరో బాల‌కృష్ణ రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టిపార్ట్ క‌థానాయ‌కుడు సంక్రాంతికి విడుద‌ల కాగా, రెండో పార్ట్ మ‌హ‌నాయ‌కుడు నిన్న‌( శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌టి పార్ట్ క‌థానాయ‌కుడు ఫ్లాప్‌గా కావ‌డంతో రెండో పార్ట్ మ‌హ‌నాయకుడుపై ఎవ్వ‌రికి పెద్ద‌గా ఆస‌క్తి లేకుండా పోయింది. మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.57 కోట్ల రూపాయల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

బాలయ్య కెరీర్ లో ఇది అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమా అయింది. బాల‌కృష్ణ కెరీర్‌లోనే ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచే అవ‌కాశం ఉంది. బాల‌కృష్ణ న‌టించిన ‘పరమవీరచక్ర’ కంటే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయి.ఇప్పుడు ఈ కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే మొదటి భాగం వల్ల నష్టపోయిన బయ్యర్లకు నష్టపరిహారం నామమాత్రంగా అయినా దక్కేలా లేదు. సినిమాకు 40 కోట్లుకు పైగా న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉందని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మొద‌టి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 0.36 cr
సీడెడ్: 0.19 cr
ఉత్తరాంధ్ర: 0.13 cr
కృష్ణ: 0.14 cr
గుంటూరు: 0.50 cr
ఈస్ట్ : 0.08 cr
వెస్ట్: 0.10 cr
నెల్లూరు: 0.07 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 1.57 cr

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -