60 ఏళ్లకు జీవితం అయిపోయిందని చెప్పింది ఎవరు?

- Advertisement -

సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితానికి రిటైర్మెంట్ అనేది ఉంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి కైనా, సాధారణ వ్యక్తికైనా 60 సంవత్సరాలు రాగానే వారికి పదవీ విరమణ వయస్సు వచ్చిందని చెబుతుంటారు.కానీ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రం ఇందుకు భిన్నంగా 60 సంవత్సరాల నుంచి ఒక మనిషి జీవితంలో సరికొత్త అంకం ప్రారంభమవుతుందని తెలిపారు.

తాజాగా పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా పూరి జగన్నాథ్ ‘లైఫ్‌ ఆంథెమ్‌’ అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ ప్రతి మనిషికి ఒకటే జీవితం, ఒకేసారి బతుకుతాం.. నువ్వు ఎవరి కోసం పుట్ట లేదు నీ కోసం ఎవరూ పుట్ట లేదు కనుక నీకు నచ్చింది నువ్వు చెయ్ మనం బతికే ఈ మూడు రోజుల ముచ్చట కోసం 16 రోజుల పెళ్లి అవసరమా? పెళ్లి తర్వాత బానిస బతుకు ఎందుకు అంటూ లైఫ్ ఆంథెమ్‌ అనే విషయంపై మాట్లాడారు.

- Advertisement -

Also read:ఓటీటీలో విడుదల అయిన కొత్త చిత్రాలు ఇవే!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక తప్పు. ఎన్ని ఫిలాసఫీలు చదివినా ఏం లాభం ఉండదు. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో ఎవరికీ మాట ఇవ్వకు మీ చుట్టు ఒక ప్రపంచాన్ని సృష్టించుకో అంటూ తెలిపారు. అదేవిధంగా 60 సంవత్సరాలకి జీవితం ఏమీ ముగిసిపోదు. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అదే సరైన సమయం. నీ జీవితంలో ఉన్న అనుభవం చిన్నవారికి నేర్పించండి ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తావో అన్ని రోజులు ఎంజాయ్ చేయండి క్లైమాక్స్ బాగుంటేనే కదా సినిమా సూపర్ హిట్ అవుతుంది అదేవిధంగా మన జీవితాన్ని కూడా ఒక బ్లాక్ బస్టర్ గా మార్చుకోవాలని ఈ సందర్భంగా పూరి వివరించారు.

Also read:జవాన్స్ తో డ్యాన్స్ వేసిన అక్షయ్ కుమార్..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -