Sunday, April 28, 2024
- Advertisement -

టాలీవుడ్‌కు షాక్‌..ప్ర‌ముఖ హ‌స్య‌న‌టుడు గుండుహ‌నుమంతురావు మృతి….

- Advertisement -

ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు (61) తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయణ్ని చికిత్స కోసం కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆస్పత్రికి తరలించారు. అయితే హన్మంతరావు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

గుండు హ‌నుమంతురావు మూత్ర సంబంధ వ్యాధితో తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకు రూ.2 లక్షల ఆర్థికసాయం ఇటీవలే అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5 లక్షలు మంజూరుచేసింది.

తరువాత ఆయన పరిస్థితి తెలుసుకుని ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు ఆర్థిక సాయం చేశారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మెగాస్టార్ చిరంజీవి రూ. 2 లక్షలు పంపించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున శివాజీరాజా ఆయనకు ధన సహాయం చేశారు. పలువురు ఇతర నటీనటులు కూడా సాయం చేశారు. అయితే, మూత్రపిండాలు రెండూ పూర్తిగా దెబ్బతినడమే ఆయన మృతికి కారణమని వైద్యులు వెల్లడించారు.

కిడ్నీల్లో సమస్య తలెత్తడంతో డయాలసిస్ తర్వాత ఇటీవలే హార్ట్ సర్జరీ చేశారు. ఆ తర్వాత నిరంతరం డయాలసిస్ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి ఆరోగ్యంగానే ఉన్న గుండు హన్మంతరావు నిద్రపోయిన తర్వాత రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆయాసంగా ఉందని చెప్పి మేల్కొన్నారు. కాసేపట్లోనే ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో హుటాహుటీన హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడకు చేరేలోపే ఆయన ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయారు. గుండు హనుమంతరావు అనారోగ్యానికి గురికావడంతో అమెరికాలో ఎంఎస్ చేస్తోన్న తనయుడు అక్కడ నుంచి వచ్చేసి ఆయణ్ని దగ్గరుండి చూసుకుంటున్నారు.

1956 అక్టోబరు 10 విజయవాడలో జన్మించిన ఆయన 18వ ఏట నాటకరంగంలో ప్రవేశించారు. అనంతరం ‘అహ నాపెళ్లంట’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన హనుమంతరావు తన హాస్యపు జల్లులతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. సుమారు 400లకు పైగా సినిమాల్లో నటించారు. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్‌ హీరో, కొబ్బరి బోండాం, బాబాయ్‌ హోటల్‌, శుభలగ్నం, క్రిమినల్‌, కలిసుందాం రా, పెళ్లాం ఊరెళితే తదితర చిత్రాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇక బుల్లితెరపై కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన నటించిన ‘అమృతం’ సీరియల్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంజి పాత్రలో ఆయన కనబర్చిన అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ సీరియల్‌కు గాను ఆయన నంది అవార్డు సైతం అందుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -