Tuesday, April 30, 2024
- Advertisement -

కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 27 మంది మృతి!

- Advertisement -

ప్రపంచాన్ని ఇప్పుడు గడ గడలాడిస్తున్న కరోనా వైరస్ ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వైరస్ రెండో సంవత్సరం సెకండ్ వేవ్ మరీ దారుణంగా తయారైంది. కరోనా చికిత్స కోసం వివిద స్థాయిలో కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కోవిడ్ సెంటర్లలో అగ్ని ప్రమాదాలు సంబవిస్తూ కరోనా పేషెంట్స్ చనిపోతున్నారు. ఈ మద్యనే భారత్ లో పలు చోట్ల కోవిడ్ సెంటర్లో అగ్ని ప్రామాదాలు సంబవించాయి.

పలువురు కరోనా రోగులు చనిపోయారు. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అల్ ఖతిబ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు పేలి 27 మంది రోగులు మృతి చెందారు. మరో 46 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 120 మంది రోగులు ఉన్నారని, వారిలో 90 మందిని భద్రతా సిబ్బంది రక్షించినట్టు అధికారులు తెలిపారు.

కాగా, ఘటన జరిగిన ప్రదేశంలో చాలా వరకు కాలిపోయిన మృతదేహాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. సంఘటనలో గాయపడని రోగులను కూడా ఆసుపత్రి నుండి బదిలీ చేస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశాయని అధికారులు వెల్లడించారు.

కరోనా ఉధృతిపై ప్రధాని మన్ కీ బాత్!

క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన మిథాలి రాజ్!

దేశంలో లాక్ డౌన్ కొనసాగింపు టెన్షన్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -